-
‘దేవర’ చలో వైజాగ్
వైజాగ్ వెళ్లనున్నారట ‘దేవర’ టీమ్. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘దేవర’. జాన్వీకపూర్ హీరోయి న్ గా నటిస్తున్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, నరైన్, సైఫ్ అలీఖా న్ , టామ్ షైన్ చాకో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వైజాగ్‌లో ్రపారంభం కానుందని ఫిల్మ్‌నగర్ సమాచారం. అయితే ఈ షెడ్యూల్లో తొలుత ఎన్టీఆర్ పాల్గొనని సన్నివేశాలను చిత్రీకరిస్తారట మేకర్స్. ప్రస్తుతం ముంబైలో హిందీ చిత్రం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు ఎన్టీఆర్. ఆ సినిమా తాజా షెడ్యూల్ పూర్తయిన తర్వాత ‘దేవర’ సెట్స్‌లో ఎన్టీఆర్ జాయి న్ అవుతారట. కల్యాణ్‌రామ్, కె.హరికృష్ణ, మిక్కిలినేని సుధాకర్ నిర్మిస్తున్న ‘దేవర’ రెండు భాగాలుగా విడుదల కానుంది. కాగా ఈ సినిమా తొలి భాగాన్ని ఈ ఏడాది అక్టోబరు 10న రిలీజ్ చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. -
ఎన్టీఆర్‌తో నటించాలని ఉంది: ఊర్వశి
ఊర్వశి రౌతేలా.. ప్రత్యేకించి పరిచయం అక్కర్లేని పేరు. తన గ్లామర్‌తో అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో.. ప్రత్యేకించి యువతలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారీ బ్యూటీ. తాజాగా ఊర్వశి రౌతేలా ఎక్స్‌లో చేసిన ఓ పోస్ట్ నెట్టింట హల్చల్ చేస్తోంది. ఎన్టీఆర్‌తో కలిసి ఉన్న ఫొటోను ఆమె షేర్ చేయడం ఇండస్ట్రీ వర్గాల్లో, ఎన్టీఆర్ అభిమానుల్లో చర్చకు తెరలేపింది. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘దేవర’ సినిమాలో ఊర్వశి నటించనున్నారేమో? అనే చర్చలు జరుగుతున్నాయి. ‘వార్ 2’ హిందీ సినిమా చిత్రీకరణ కోసం ముంబయ్‌లో ఉన్నారు ఎన్టీఆర్. ఆయనతో జిమ్‌లో దిగిన ఫొటోను ఊర్వశి సోషల్ మీడియాలో షేర్ చేసి.. ‘‘ఎన్టీఆర్‌గారు మన ప్రియమైన, నిజమైన గ్లోబల్ సూపర్ స్టార్. క్రమశిక్షణ, నిజాయితీ, వినయపూర్వకంగా ఉండే వ్యక్తి. మీ దయ, ప్రోత్సాహానికి కృతజ్ఞతలు. మీ వ్యక్తిత్వం నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో మీతో కలిసి పని చేయడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు. ఈ పోస్ట్ చూసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ‘దేవర’ చిత్రంలో ఊర్వశి రౌతేలా ప్రత్యేక పాటలో కనిపించనున్నారా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఊర్వశి తెలుగులో ‘వాల్తేరు వీరయ్య, ఏజెంట్, బ్రో, స్కంద’ వంటి చిత్రాల్లో ప్రత్యేక పాటల్లో తన డ్యాన్స్‌తో అలరించారు. మరి... ఎన్టీఆర్ సినిమాలో నటించాలనే ఆసక్తి కనబరుస్తున్న ఊర్వశికి ఆ చాన్స్ వస్తుందా? అనేది చూడాలి. View this post on Instagram A post shared by URVASHI RAUTELA (@urvashirautela) -
పాట.. ఫైటు
గోవాకు బై బై చెప్పారు ‘దేవర’. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జాన్వీ కపూర్ హీరోయిన్. శ్రుతీ మరాఠి, చైత్ర, సైఫ్ అలీఖాన్ కీలక పాత్రల్లో కనిపిస్తారు. కాగా ఇటీవల గోవాలో మొదలైన ‘దేవర’ సినిమా చిత్రీకరణ ముగిసిందని సమాచారం. ఓ ఫైటు సీక్వెన్స్ తో పాటు ఓ పాటను చిత్రీకరించారట మేకర్స్. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ కాంబినేషన్ లోని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందని తెలిసింది. తదుపరి షెడ్యూల్ హైదరాబాద్‌లో ప్రారంభం అవుతుందని, ఏప్రిల్ మొదటివారంలో ఈ కొత్త షెడ్యూల్ ఉండే అవకాశం ఉందని భోగట్టా. కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచంద్రన్ స్వరకర్త. రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది. -
పుష్ప 2 సాంగ్ ని మించి దేవర బంపర్ సాంగ్!
-
శ్రుతికి స్వాగతం పలికిన 'దేవర'
మరాఠీ, తమిళ భాషల్లో సినిమాలు చేస్తున్న గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే తెలుగు చిత్ర పరిశ్రమకు వస్తున్నారు. ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న ‘దేవర’ సినిమాతో శ్రుతి తెలుగుకు పరిచయం కానున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న ‘దేవర’ షూటింగ్లో శ్రుతి జాయిన్ అయ్యారు. ఈ విషయాన్ని సోషల్ మాధ్యమాల వేదికగా వెల్లడించారు శ్రుతి. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి కాగానే పాటల చిత్రీకరణ కోసం చిత్ర యూనిట్ కేరళ వెళ్లాలనే ఆలోచనలో ఉందని సమాచారం. కొరటాల శివ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మిక్కిలినేని సుధాకర్, కె. హరికృష్ణ నిర్మిస్తున్న ‘దేవర’ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుంది. తొలి భాగం ఈ ఏడాది అక్టోబరు 10న విడుదల కానుంది.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్‌ఝున్‌వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్‌కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్‌బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement