మామతో కలిసి ఒకే వేదికపై అవార్డు అందుకోడం అద్భుతం: ధనుష్‌

26 Oct, 2021 11:06 IST|Sakshi

తమిళ నటుడు ధనుష్‌ ఉత్తమ నటుడిగా నేషనల్‌ అవార్డు అందుకున్న విషయం తెలిసిందే. తమిళ చిత్రం ‘అసురన్‌’లో ఆయన నటనకు గానూ ఉప​రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఈ పురస్కారం అందుకున్నాడు. అయితే అదే రోజు సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ని దాదా సాహెబ్‌ ఫాల్కే అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం. ఈ తరుణంలో ఇది వర్ణనాతీతమైన అనుభూతి అంటూ సోషల్‌ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు ఈ హీరో.

ధనుష్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో తన మామ, స్టార్‌ రజనీతో కలిసి ఉన్న ఫోటోని షేర్‌ చేశాడు. దానికి.. ‘‘తలైవర్‌’ దాదాసాహెబ్‌ ఫాల్కే అందుకున్న అదే వేదికపై, అదే రోజు బెస్ట్‌ యాక్టర్‌గా అవార్డు అందుకోవడం వర్ణించడానికి మాటలు లేని అనుభూతి. ఇలాంటి గొప్ప బహుమతి ఇచ్చినందుకు జాతీయ అవార్డు జ్యూరీకి ధన్యవాదాలు. నాకు సపోర్టుగా నిలిచిన ప్రెస్‌, మీడియాకి కృతజ్ఞతలు’ అంటూ రాసుకొచ్చాడు. అలాగే ఈ నటుడు ఫ్యాన్స్‌ కోసం అంటూ మెడల్‌ పిక్‌ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. 

A post shared by Dhanush (@dhanushkraja)

అంతేకాకుండా ధనుష్‌ పోస్ట్‌కంటే ముందు, ఆయన భార్య తన తండ్రి, భర్త ఉన​ ఫోటోని ఇన్‌స్టాలో షేర్‌ చేసింది. రజనీకి కూతురిగా, ధనుష్‌కి భార్యగా ఉండడం గర్వంగా ఉందని తెలిపింది. అయితే ‘భోంస్లే’ చిత్రానికి గానూ మనోజ్‌ బాజ్‌పేయితో కలిసి ధనుష్‌ ఈ అవార్డు అందుకున్నాడు. ఇప్పటివరకు ఆయన నాలుగు జాతీయ అవార్డులు గెలుచుకున్నాడు.

A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush)

చదవండి: టాలీవుడ్‌పై ధనుష్‌ స్పెషల్‌ ఫోకస్‌.. మరో ఇద్దరితో చర్చలు!

మరిన్ని వార్తలు