Sankranthi 2024 Movies: టాలీవుడ్ బడా నిర్మాతలు రాజీ పడ్డారా? చివరకు ఒక్కటయ్యారా?

19 Jan, 2024 21:14 IST|Sakshi

ఈసారి సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దడదడలాడింది. రిలీజైన సినిమాల కంటే నిర్మాత దిల్ రాజు ఎక్కువగా హైలైట్ అయ్యారు. థియేటర్ల విషయంలో 'హనుమాన్' చిత్రానికి అన్యాయం జరగడానికి ఈయనే కారణమని అన్నారు. ఈ క్రమంలోనే ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు వార్నింగ్ ఇవ్వడం కాస్త చర్చనీయాంశమైంది కూడా. ఇప్పుడు సంక్రాంతి సినిమాల పంచాయతీ విషయం కాస్త సెటిలైనట్లు కనిపిస్తోంది.

(ఇదీ చదవండి: ఓటీటీలో తెలుగు ప్రేక్షకుల్ని ఏడిపించేస్తున్న సినిమా.. మీరు చూశారా?)

ఈసారి పండక్కి నాలుగు సినిమాలు రిలీజయ్యాయి. వీటిలో 'గుంటూరు కారం', 'హనుమాన్' చిత్రాలు జనవరి 12న రిలీజయ్యాయి. వీటిలో మహేశ్ మూవీని నైజాంలో దిల్ రాజుకి చెందిన ఎస్వీసీ డిస్ట్రిబ్యూట్ చేసింది. 'హనుమాన్'ని మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూట్ చేసింది. అయితే హైదరాబాద్‌లోని సింగిల్ స్క్రీన్స్ అన్నీ 'గుంటూరు కారం'కి కేటాయించి.. కేవలం మూడు మాత్రమే 'హనుమాన్' చిత్రానికి ఇచ్చారనే విషయం బయటకు రావడంతో ఇది చర‍్చనీయాంశంగా మారిపోయింది. చివరికొచ్చేసరికి ఆ మూడు కూడా తీసేసుకున్నారని వినిపించింది.

అయితే థియేటర్ల తీసుకున్నారనే విషయమై తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో కేసు నమోదు చేయడంతో మొత్తం రచ్చ రచ్చ అయింది. అయితే ఇప్పుడు దిల్ రాజుకు చెందిన ఎస్వీసీ, అలానే 'హనుమాన్'ని డిస్ట్రిబ్యూట్ చేసి మైత్రీ మూవీ మేకర్స్ పెద్దలు ఓ అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపై గొడవలు పడకూడదని, కలిసి ఓ ప్లానింగ్‌తో ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారట. ఈ క్రమంలోనే ఎస్వీసీ తమకు చెందిన పలు థియేటర్లలో సినిమాలు తీసేసి, 'హనుమాన్'కి కేటాయించినట్లు తెలుస్తోంది. ఇప్పుడీ విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయిపోయింది.

(ఇదీ చదవండి: రష్మికతో ఎంగేజ్‌మెంట్‌పై క్లారిటీ ఇచ్చేసిన విజయ్ దేవరకొండ)

>
మరిన్ని వార్తలు