-
గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి: తేజ సజ్జ
‘‘సత్యం’ థియేటర్లో వందరోజులు ఆడిన సినిమాలు చూశాను. అలాంటి ప్లేస్‌లో మా ‘హను–మాన్’ వంద రోజుల పండగ జరుపుకోవడం హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు మాకు ఇచ్చిన గిఫ్ట్ ఇది’’ అని తేజ సజ్జా అన్నారు. తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘హను–మాన్’. చైతన్య సమర్పణలో కె. నిరంజన్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది జనవరి 12న విడుదలైంది. దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం 25 కేంద్రాల్లో వంద రోజుల ప్రదర్శనను పూర్తి చేసుకుందని చిత్ర యూనిట్ పేర్కొంది.ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ‘హను–మాన్’ హిస్టారిక్ 100 డేస్ సెలబ్రేషన్స్‌లో తేజ సజ్జా మాట్లాడుతూ– ‘‘దర్శకుడు ప్రశాంత్ వర్మ, నిర్మాత నిరంజన్రెడ్డిగారిలోని ధైర్యాన్ని ఈ తరం స్ఫూర్తిగా తీసుకోవాలి. గట్స్ ఉన్నవాళ్లకే హిట్స్ వస్తాయి’’ అన్నారు. ‘‘ఇంద్ర, నువ్వు నాకు నచ్చావ్, పోకిరి’ వంటివి.. నాకు బాగా గుర్తున్న వంద రోజుల వేడుకలు జరుపుకున్న సినిమాలు. అయితే ఇప్పుడు సినిమా అంటే ఓ వీకెండ్ అయిపోయింది. ఇలాంటి తరంలో వందో రోజు కూడా థియేటర్స్‌కు వచ్చి ఆడియన్స్ మా సినిమా చూస్తున్నారంటే అది మా అదృష్టంగా భావిస్తున్నాం. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ (పీవీసీయు)లో రాబోయే సినిమాల్లో అన్ని పరిశ్రమల నుంచి పెద్ద నటీనటులు కనిపిస్తారు’’ అన్నారు ప్రశాంత్ వర్మ.‘‘నా కాలేజీ రోజుల్లో సినిమాల వంద రోజుల ఫంక్షన్స్ చూసేవాడిని. అలాంటిది నేను నిర్మించిన సినిమా వంద రోజులు జరుపుకోవడం హ్యాపీగా ఉంది’’ అన్నారు నిరంజన్ రెడ్డి. ‘‘హను–మాన్’ వంద రోజుల వేడుక చేసుకోవడం హ్యాపీగా ఉంది’’అన్నారు చైతన్య. ఐమాక్స్ త్రీడీలో జై హనుమాన్... ‘హను–మాన్’కు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ రానుంది. మంగళవారం (ఏప్రిల్ 23) హనుమాన్ జయంతి సందర్భంగా కొత్త పోస్టర్‌ను విడుదల చేసి, భారీ వీఎఫ్ఎక్స్తో రూపొందించనున్న ఈ సినిమాను ఐమాక్స్ 3డీ వెర్షన్లో విడుదల చేయనున్నట్లు యూనిట్ పేర్కొంది. -
Hanu-Man: రిస్క్ చేశాడు... హిట్ కొట్టాడు
తేజ సజ్జ హీరోగా నటించిన హను-మాన్ చిత్రం టాలీవుడ్లో సంచలనం సృష్టించింది. సూపర్ హీరో కాన్సెప్ట్ కి ఇండియన్ మైథాలజీని లింక్ చేసి తెరకెక్కించిన ఈ అద్భుతానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఫలితంగా బాక్సాఫీస్ వద్ద రూ. 350 కోట్లకుపైగా వసూళ్లను సాధించి, సరికొత్త రికార్డుని క్రియేట్ చేసింది. అయితే ఈ విక్టరీ క్రెడిట్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, హీరో తేజ సజ్జకే ఎక్కువగా వెళ్లింది. కానీ వీరిద్దరితో పాటు మరో వ్యక్తికి ఈ విజయానికి కీలకంగా నిలిచాడు. ఆయనే నిర్మాత కె. నిరంజన్ రెడ్డి. ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్మించాడు. రూ.15 కోట్ల బడ్జెట్ అనుకొని ఈ సినిమాను ప్రారంభించారు. కానీ చివరికి రూ.65 కోట్ల వరకు ఖర్చు అయింది. అయితే సినిమాపై నమ్మకంతో నిరంజన్ రెడ్డి ధైర్యం చేశాడు. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ గ్లోబల్ లెవల్ క్వాలిటీతో ఉండేలా జాగ్రత్త పడ్డాడు. కథ ఎంపిక స్వయంగా పర్యవేక్షించి అమలు చేశారు. పెద్ద హీరోలు సంక్రాంతి బరిలో ఉన్నారు.. రిస్క్ చేయడమే.. అని అందరు అంటున్న కూడా.. పక్కా ప్లాన్ తో థియేటర్స్‌లో రిలీజ్ చేసారు. ఇంకేముంది ఓ యజ్ఞంలా నిర్మించిన సినిమా మహద్భుతం క్రియేట్ చేసింది. ఈ రోజుల్లో వంద రోజుల పాటు థియేటర్లలో నడిచిన సినిమాగా రికార్డు సృష్టించడమే కాకుండా కలెక్షన్లలోనూ సరికొత్త రికార్డుల దిశగా దూసుకుపోతోంది. దీనికి కారణమైన తెరవెనుక అసలు హీరో.. నిర్మాత కె. నిరంజన్ రెడ్డి అంటూ సినీ విశ్లేషకులు కొనియాడుతున్నారు. -
హనుమాన్ హీరో కొత్త మూవీ.. గ్లింప్స్ చూస్తే గూస్‌బంప్సే!
హనుమాన్ మూవీతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన యంగ్ హీరో తేజ సజ్జా. ఈ సినిమాతో ఒక్కసారిగా క్రేజ్ దక్కించుకున్నారు. తేజ మరో హిస్టారికల్ మూవీ చేసేందుకు రెడీ అయిపోయారు. తేజ సజ్జాకు జంటగా రితికా నాయక్ నటిస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో టీజీ విశ్వ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన రవితేజతో ఈగల్ మూవీని తెరకెక్కించారు. తాజాగా ఈ మూవీ టైటిల్‌తో పాటు గ్లింప్స్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. హైదరాబాగ్లోని రామానాయుడు స్టూడియోలో జరిగిన కార్యక్రమంలో టైటిల్ రివీల్ చేశారు. తేజ సజ్జా తాజా చిత్రానికి మిరాయి అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రంలో తేజ సూపర్‌యోధ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్లో తేజ సజ్జ సూపర్ యోధా లుక్‌లో కనిపించారు. బద్దలయ్యే అగ్నిపర్వతం పైన నిలబడి ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను అశోకుని కాలంలో జరిగిన కళింగ యుద్ధం ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు గ్లింప్ల్ చూస్తే అర్థమవుతోంది. మిరాయి సినిమాను తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, మరాఠీతో పాటు చైనీస్ భాషల్లోనూ వచ్చే ఏడాది ఏప్రిల్ 18న విడుదల చేయనున్నారు. From the hush of ancient narratives📜 Comes a thrilling adventurous saga of a #SuperYodha 🥷⚔️#PMF36 x #TejaSajja6 Titled as #𝐌𝐈𝐑𝐀𝐈 ⚔️#MIRAITitleGlimpse out now💥 -- https://t.co/k4tycunRkA In Cinemas on 18th APRIL 2025 ~ 2D & 3D🔥 SuperHero @tejasajja123… pic.twitter.com/WN2MB2EPlE — People Media Factory (@peoplemediafcy) April 18, 2024 -
'మాటిస్తున్నా.. అంతకుమించి'.. హనుమాన్ డైరెక్టర్ ట్వీట్!
ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో వచ్చిన చిత్రం హనుమాన్. తేజ సజ్జా ప్రధాన పాత్రలో తెరెకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపించింది. సంక్రాంతి రిలీజై బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. పెద్ద సినిమాలతో పోటీ పడి రూ.250 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టింది. హనుమాన్ సూపర్ హిట్ కావడంతో ఈ చిత్రాని సీక్వెల్ కూడా ఉంటుందని ఇప్పటికే ప్రశాంత్ వర్మ ప్రకటించారు. ప్రస్తుతం అదే పనిలో బిజీగా ఉన్నారు. ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ప్రశాంత్. సీక్వెల్‌గా వస్తోన్న జై హనుమాన్ మూవీ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ విషయాన్ని తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. హనుమాన్ కంటే అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు తెలిపారు. ఈ పవిత్రమైన శ్రీరామనవమి సందర్భంగా మీకు మాటిస్తున్నా అంటూ పోస్ట్ చేశారు. కాగా.. జై హనుమాన్ చిత్ర పనులు ఏడాది కిందటే మొదలు పెట్టామని ప్రశాంత్ వర్మ ఇటీవల తెలిపారు. కథ సిద్ధంగా ఉందని.. ఎలా తీయాలో అన్న విషయంపై ఇంకా వర్క్ జరుగుతోంది. వీఎఫ్ఎక్స్తో పాటు మిగిలిన వాటిపై ఓ క్లారిటీ రాగానే షూటింగ్ మొదలవుతుందన్నారు. రాబోయే సినిమాల నాణ్యత విషయంలో అస్సలు రాజీపడది లేదని ప్రశాంత్ వర్మ చెప్పుకొచ్చారు. "वचनं धर्मस्य रक्षणं" 🙏 Wishing everyone a very Happy & Blessed #RamNavami ❤️ On this sacred occasion and with the divine blessings of Lord Rama, this is my promise to all the audience across the globe to give you an experience like never before & a film to celebrate for a… pic.twitter.com/gFNWsN9F06 — Prasanth Varma (@PrasanthVarma) April 17, 2024 -
Teja Sajja: ‘సూపర్ యోధ’గా ‘హను-మాన్’ హీరో
‘హను–మాన్’ చిత్రంతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు హీరో తేజ సజ్జా. తాజాగా ఆయన కొత్త సినిమా ప్రకటన వచ్చింది. ‘ఈగల్’ ఫేమ్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమా నిర్మించనున్నారు. ఈ చిత్రాన్ని ప్రకటించి, పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. ‘హను–మాన్’ చిత్రంలో సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన తేజ.. కొత్త పోస్టర్లో స్టైలిష్ మేకోవర్‌లో కనిపించారు. ‘‘సూపర్ యోధ సాహసోపేతమైన కథతో పాన్ ఇండియా మూవీగా ఇది తెరకెక్కనుంది. ‘ఈగల్’ తర్వాత కార్తీక్ ఘట్టమనేనితో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. ఈ సినిమా పూర్తి వివరాలను ఈ నెల 18న ప్రకటిస్తాం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, క్రియేటివ్డ్యూసర్: కృతీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సుజిత్ కుమార్ కొల్లి. Wishing my Super Hero @TejaSajja123 Super talented @Karthik_gatta & Super passionate @vishwaprasadtg garu all the best for #PMF36 🤗 Title Announcement Glimpse on 𝗔𝗣𝗥𝗜𝗟 𝟭𝟴𝘁𝗵 #SuperYodha 🥷 pic.twitter.com/aOqpz1z08E — Prasanth Varma (@PrasanthVarma) April 15, 2024
Pagination
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
భర్తతో విడిపోయిన హీరోయిన్.. కూతురితో కలిసి..
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
కాంగ్రెస్‌కు శామ్ పిట్రోడా రాజీనామా
స్టార్ హీరోలతో యాక్టింగ్.. ఆ కమెడియన్ ఇలా అయిపోయాడేంటి!
ఫ్రెండ్ కోసం పెళ్లినే వాయిదా వేసుకున్న హీరోయిన్ (ఫోటోలు)
ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
IPL 2024: సన్‌రైజర్స్, లక్నో మ్యాచ్.. లంక యువ స్పిన్నర్ అరంగేట్రం
ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
IPL 2024 SRH VS LSG: మరో మూడేస్తే..!
ఐసీఎంఆర్ విడుదల చేసిన ఆహార మార్గదర్శకాలు ఇవే..
వైట్‌హౌస్‌కు ఏఐ టెక్నాలజీని పరిచయం చేసిన భారత సంతతి ఇంజనీర్! ఎవరీమె?
తప్పక చదవండి
- ఓట్ల తాయిలాలు షురూ.. బీజేపీపై దీదీ ఫైర్
- ఒక్క క్లిక్‌తో ‘ఏపీ పాలిసెట్’ ఫలితాలు
- సుప్రీత మైండ్ బ్లోయింగ్ గ్లామర్.. ఫారెన్ వీధుల్లో కేతిక!
- పిట్రోడా వ్యాఖ్యల దుమారం.. నిర్మలా సీతారామన్ ఆగ్రహం
- జ్యుడీషియల్ కస్టడీకి రేవణ్ణ
- పవన్ మూవీ రిలీజ్ డేట్‌కి టెండర్ వేసిన 'దేవర'?
- ఓటీటీలోకి వచ్చేస్తున్న మరో వివాదాస్పద మూవీ
- టీ20 వరల్డ్‌కప్ 2024 కోసం భారత బి టీమ్.. కెప్టెన్‌గా కేఎల్ రాహుల్..!
- ‘నోరు మెదపరేం రాహుల్జీ?’..ప్రధాని మోదీ విమర్శలు
- బాబోస్తే ఆరోగ్యశ్రీ గో..వింద
Advertisement