రూ.25 కోట్ల డూప్లెక్స్ ఇల్లు‌ కొన్న స్టార్‌ డైరెక్టర్‌

20 Apr, 2021 08:23 IST|Sakshi

ముంబై: సాధారణంగా హీరోలకే పారితోషికం ఎక్కువగా ఉంటుందనుకుంటాం. కానీ కొందరు స్టార్‌ డైరెక్టలకు వారికంటే ఎక్కువ రెమ్యునరేషన్‌ ఉంటుంది. ఈ లిస్ట్‌లో బాలీవుడ్‌ ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ముందు వరుసలో ఉంటాడు. 'తను వెడ్స్‌ మను' వంటి బాక్సాఫీస్‌ హిట్‌ చిత్రాలను అందించిన ఆయన తాజాగా ముంబైలో ఓ డూప్లెక్స్‌ను కొనుగోలు చేశారట. తన భార్య యోగితతో కలిసి ఈ భవనాన్ని తన సొంతం చేసుకున్నారట. ఇది బాలీవుడ్‌ తార సన్నీలియోన్‌ ఇంటి సమీపంలో ఉందని సమాచారం.

5,761 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న ఈ విలాసవంతమైన డూప్లెక్స్‌ ఖరీదు అక్షరాలా రూ.25.3 కోట్లుగా ఉంది. గత నెల మార్చి 8న స్టాంప్‌ డ్యూటీ కింద రూ.75.9 లక్షలు సైతం చెల్లించాడట. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ భవనంలో 34 అపార్ట్‌మెంట్లు ఉంటాయని తెలుస్తోంది. ఇదిలా వుంటే ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ ప్రస్తుతం అక్షయ్‌ కుమార్‌, ధనుష్‌, సారా అలీఖాన్‌లతో 'ఆత్రంగిరే' సినిమా తీస్తున్నాడు. ఈ మధ్యే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కానుంది. రెహమాన్‌ సంగీతం అందించిన ఈ సినిమాలో ధనుష్‌ స్వయంగా ఓ పాట కూడా పాడాడు.

చదవండి: సుకుమార్‌-రౌడీ సినిమాపై రూమర్లు.. వాస్తవమేంటంటే!

మళ్లీ మాల్దీవుల్లో వాలిపోయిన బాలీవుడ్‌ కపుల్స్‌

దర్శకుడికి కరోనా: టెన్షన్‌లో ధనుష్‌ ఫ్యాన్స్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు