చై-సామ్‌ బ్రేకప్‌.. హీరోయిన్‌ను వెతికే పనిలో పడ్డ డైరెక్టర్‌!

3 Apr, 2022 11:06 IST|Sakshi

టాలీవుడ్ సూపర్ హిట్ పెయిర్స్ లో నాగ చైతన్య, సమంత జోడి ఒకటి. ఏమాయ చేసావే మొదలు వీరిద్దరు నటించిన ప్రతి సినిమా టాలీవుడ్ కు సమ్ థింగ్ స్పెషల్. మనం క్లాసిక్ స్టేటస్ ను అందుకుంది. మజిలీ సూపర్ హిట్ అయింది. అందుకే వీరిద్దరి కాంబినేషన్ లో చాలా కథలు రాసుకున్నారు దర్శకులు. ఓ బేబీ దర్శకురాలు నందిని రెడ్డి కూడా ఓ స్టోరీ రాసుకుందట.వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కించాల్సిన సమయంలో విడిపోవడంతో నందినిరెడ్డి ఈ ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినట్లు సమాచారం. ఇప్పుడు మళ్లీ ఆ ప్రాజెక్టుని నాగ చైతన్య తో  పట్టాలెక్కించేందుకు నందినిరెడ్డి ప్రయత్నాలు చేస్తోంది.

గతంలో చై, సామ్ కోసం రెడీ చేసిన స్టోరీని తెరకెక్కించనుందట. అయితే సమంత  స్థానంలో మరో హీరోయిన్ కు అవకాశం ఇవ్వనుందట.ప్రస్తుతం నందినిరెడ్డి ఆ హీరోయిన్ ను వెతికే పనిలో ఉందని సమాచారం. హీరోయిన్‌ కన్‌ఫామ్‌ అయిన తర్వాతే ఈ ప్రాజెక్టుని అఫియల్‌గా ఎనౌన్స్‌ చేయనున్నట్లు తెలుస్తోంది. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య త్వరలో థ్యాంక్యూ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ కోసం దూత పేరుతో వెబ్ సిరీస్ చేస్తున్నాడు.ఈ వెబ్ సిరీస్ పూర్తైన తర్వాత నందినిరెడ్డి దర్శకత్వంలో నటించే సినిమా పై చై క్లారిటీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.
 

మరిన్ని వార్తలు