ఎవర్నీ తక్కువ చేసి చూపించలేదు

1 Mar, 2021 14:47 IST|Sakshi

నందమూరి తారకరత్న హీరోగా నర్రా శివనాగేశ్వరరావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘దేవినేని’. ‘బెజవాడ సింహం’ అనేది ట్యాగ్‌ లైన్‌. వంగవీటి రాధా పాత్రలో నటుడు బెనర్జీ, వంగవీటి రంగా పాత్రలో సురేష్‌ కొండేటి, చలసాని వెంకటరత్నం పాత్రలో తుమ్మల ప్రసన్నకుమార్, కేఎస్‌ వ్యాస్‌ పాత్రలో ప్రముఖ సంగీత దర్శకుడు కోటి నటించారు. ఇటీవల ఈ సినిమా ప్రమోషనల్‌ సాంగ్‌ను విడుదల చేసిన ప్రముఖ నిర్మాత, ప్రొడ్యూసర్‌ కౌన్సిల్‌ ప్రెసిడెంట్‌ సి. కల్యాణ్‌ మాట్లాడుతూ–‘‘తెరవెనుక కష్టాలున్న ప్రాజెక్ట్స్‌లో క్వాలిటీగా చేసిన సినిమాల్నీ హిట్‌ అయ్యాయి. అలాంటి కోవలో వస్తున్న ‘దేవినేని’ కూడా విజయం సాధించాలి. ఎస్టాబ్లిష్డ్‌ క్యారెక్టర్స్‌తో సినిమా చేయడం చాలా కష్టం. ఈ సినిమాతో ప్రతి ఒక్కరికీ మంచి పేరు వచ్చి, నిర్మాతలకు డబ్బులు రావాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.

శివనాగేశ్వర రావు మాట్లాడుతూ–‘‘నేను తీసిన ఈ ‘దేవినేని’ బయోపిక్‌ కాదు. దేవినేని, వంగవీటి గార్ల మీద అభిమానంతోనే ఈ సినిమా తీశా.  ఈ రెండు కుటుంబాల్లో ఎవర్నీ తక్కువగా చూపించలేదు. ఇప్పటికే ఈ సినిమాపై చాలా కేసులు వేశారు. చిన్న నిర్మాతలైనా ఈ సినిమాను ఎంతో కష్టపడి నిర్మించారు. దయచేసి ఈ గొడవలను ఆపి, పాజిటివ్‌గా ఆలోచించి సినిమాను ఆదరించాలి’’ అన్నారు. ‘‘మంచి కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ చిత్రం రియలిస్టిక్‌గా ఉంటుంది’’ అన్నారు నిర్మాత రాము. ఈ కార్యక్రమంలో సురేష్‌ కొండేటి, నాగేంద్రబాబు పాల్గొన్నారు. 

చదవండి:

శృతి ప్రియుడికి థాంక్స్‌ చెప్పిన కమల్‌!

ఫొటోగ్రాఫర్‌కు బాలీవుడ్‌ హీరో హెచ్చరిక!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు