సీక్రెట్‌ పుట్టుమచ్చను షేర్‌ చేసిన స్టార్‌ హీరోయిన్‌‌

16 Apr, 2021 10:46 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ బ్యూటీ దిశా తరుచూ వార్తల్లో నిలుస్తోంది. స్టార్‌ హీరో టైగర్‌ ఫ్రాఫ్‌తో ప్రేమాయణం ఈ బ్యూటీని మరింత పాపులర్‌ చేసింది. వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారని, కొంతకాలంగా టైగర్‌- దిశా పటానీ డేటింగ్‌ చేస్తున్నారని బీ-టౌన్‌లో టాక్‌ వినిపిస్తున్న సంగతి తెలిసిందే.  దీనికి తోడు ఇద్దరూ కలిసి పలు పార్టీలు, డిన్నర్‌లలో పాల్గొంటూ పలు సార్లు కెమెరాలకు చిక్కారు. దీంతో ఈ లవ్‌ కపుల్‌కి బాలీవుడ్‌లో యూత్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉంది.

ఇక సోషల్‌మీడియాలో నిత్యం యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో 'ఆస్క్ మై ఎనీథింగ్' సెషన్‌ను నిర్వహించింది. ఇందులో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు ఆన్సర్‌ చేసింది. కాగా ఇతరులకుచ, మీకు ఉన్న తేడా ఏంటీ? అని ఓ నెటిజన్‌ ప్రశ్నించగా దిశా షేర్‌ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. తనకు కంటి కింద పుట్టుమచ్చ ఉందని, ఇదే తనను అందరి కంటే ప్రత్యేకంగా చూపిస్తుందని పేర్కొంది. ఇక సినిమాల విషయానికి వస్తే సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తున్న 'రాధే'  చిత్రంలో దిశా పటానీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం మే 13న విడుదల కానుంది. 

చదవండి : యాక్షన్‌ హీరోకు గాయాలు, పరిగెత్తుకొచ్చిన ప్రియురాలు
డిలీట్‌ చెయ్‌, లేదంటే చంపేస్తాం: యాంకర్‌కు బెదిరింపులు


 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు