‘డాన్  360’: మొబైల్ యాప్ తో రౌడీలను బుక్ చేసుకోవచ్చు !

26 Nov, 2023 04:07 IST|Sakshi

భరత్‌కృష్ణ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన యాక్షన్  చిత్రం ‘డాన్  360’. ప్రియా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో శ్రీకాంత్‌ అయ్యంగార్, అర్చన అనంత్, సతీష్‌ సారిపల్లి కీలక పాత్రలు పోషించారు. ఉదయ రాజ్ వర్మ నిర్మిస్తున్నారు.

ఓ మొబైల్‌ యాప్‌తో రౌడీలను బుక్‌ చేసుకోవచ్చనే ఓ కొత్త కాన్సెప్ట్‌తో ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో భరత్‌ కృష్ణ మాట్లాడుతూ– ‘‘కొత్తదనం ఉంటే ఆ సినిమాను ప్రేక్షకులు ఆశీర్వదిస్తారు. ఈ కోవలో మా చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఉంది’’ అన్నారు. ఈ కార్యక్రమంలో హీరోయిన్  ప్రియా హెగ్డే, సతీష్‌ సారిపల్లి మాట్లాడారు.

>
మరిన్ని వార్తలు