డ్రగ్‌ కేసు; వివేక్ ఒబెరాయ్ ఇంట్లో సోదాలు

15 Oct, 2020 15:19 IST|Sakshi

ముంబై : నటుడు వివేక్ ఒబెరాయ్ ఇంట్లో బెంగళూరు పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. శాండల్ డ్రగ్స్ కేసులో వివేక్ బావమరిది అదిత్య అల్వాకు సంబంధాలు ఉండటంతో పోలీసులు నేడు ముంబైలోని వివేక్‌ ఇంట్లో ఈ సోదాలు చేశారు. ఆదిత్య అల్వా ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు బెంగుళూరు జాయింట్‌ కమిషనర్‌ సందీప్‌ పాటిల్‌ తెలిపారు. అదే విధంగా అతని బంధువైన వివేక్‌ ఒబెరాయ్‌ ఇంట్లో సందీప్‌ ఉన్నట్లు తమకు సమాచారం అందిందని అందుకే తనిఖీ చేసినట్లు వెల్లడించారు. కోర్టు నుంచి వారెంట్‌ పొందిన తర్వాతే క్రైమ్‌ బ్రాంచ్‌‌ పోలీసుల బృందం ముంబైలోని ఒబెరాయ్‌ ఇంట్లోకి వెళ్లిందని పేర్కొన్నారు. కాగా అదిత్య సోదరి ప్రియాంకను అల్వాను 2010లో వివేక్ వివాహం చేసుకున్నారు. చదవండి: నేరస్తురాలిని కాను: అనుశ్రీ ఆవేదన

కర్ణాటక మాజీ మంత్రి జీవరాజ్ అల్వా కుమారుడు అయిన ఆదిత్య అల్వా  కన్నడ సినీ ప్రముఖలకు, సింగర్స్‌కు డ్రగ్స్ సరఫరా చేసిన కేసులో నిందితుడిగా ఉన్నాడు. కన్నడ చిత్ర పరిశ్రమలో వెలుగు చూసిన శాండల్‌వుడ్‌ డ్రగ్స్ కుంభకోణం కేసులో పోలీసులు చర్య ప్రారంభించినప్పటి నుంచి అతను పరారీలో ఉన్నాడు. మరోవైపు అధికారులు బెంగళూరులోని అదిత్య అల్వా ఇంట్లో కూడా సోదాలు నిర్వహించారు. ఈ కేసులో ఇప్పటికే 15 మంది అరెస్ట్‌ అవ్వగా వీరిలో  నటీమణులు రాగిణి ద్వివేది, సంజన గల్రానీ ఉన్నారు. అలాగే రేవ్ పార్టీ నిర్వాహకుడు వీరెన్ ఖన్నా, రియల్టర్ రాహుల్ థోన్స్ కూడా ఉన్నారు. చదవండి: డ్రగ్స్‌ కేసులో కన్నడ హీరోయిన్లకు షాక్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా