Rakul Preet Singh: రకుల్ ప్రీత్‌ సింగ్‌కు మరోసారి ఈడీ నోటీసులు

16 Dec, 2022 14:13 IST|Sakshi

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌ సింగ్‌కు ఈడీ మరోసారి షాకిచ్చింది. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో విచారణకు హాజరు కావాలంటూ నోటీసులిచ్చింది. ఇప్పటికే ఆమెను గతేడాది విచారించిన ఈడీ అధికారులు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే గతంలో రకుల్ విచారణ మధ్యలోనే వెళ్లిపోయారు. దీంతో పూర్తిస్థాయిలో విచారించక పోవడంతో మరోసారి హాజరు కావాలని సూచించారు. 

 కాగా.. టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే గతేడాది ఆగస్టు 31వ తేదీ నుంచి సెప్టెంబర్ 22వ తేదీ వరకు సిట్ ఏర్పాటు చేసి పలువురు టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లు, దర్శకుల్ని ప్రశ్నించారు. వీరిలో పూరి జగన్నాథ్, ఛార్మి, రవితేజ, రకుల్ ప్రీత్ సింగ్, దగ్గుపాటి రానా, ముమైత్ ఖాన్, నందు, తనీష్, తరుణ్, నవనీత్,  పబ్ మేనేజర్ మేనేజర్, రవితేజ డ్రైవర్ శ్రీనివాసులు కూడా ఉన్నారు.
 

మరిన్ని వార్తలు