ఆర్థిక మాంద్యంలోనూ అదరగొట్టిన మల్టీబ్యాగర్‌ స్టాక్‌.. కలలో కూడా ఊహించని లాభం!

16 Dec, 2022 13:36 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం భయాలు ఉన్నప్పటికీ భారత స్టాక్ మార్కెట్‌లోని కొన్ని మల్టీబ్యాగర్‌ స్టాక్‌లు ఈ ఏడాది అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్నాయి. మార్కెట్లో అదరగొడుతూ పెట్టుబడిదారులకు కాసుల వర్షాన్ని కురిపిస్తున్నాయి. ప్రస్తుతం మనం అలాంటి ఒక మల్టీబ్యాగర్‌ స్టాక్ గురించి తెలుసుకోబోతున్నాం. అదే ఉక్కు రంగంలో కామధేను లిమిటెడ్ కంపెనీ. కామధేను స్టాక్‌ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే ఇన్వెస్టర్లకు కళ్లు చెదిరే లాభాలును అందించింది.

కేవలం 50 రోజుల్లో 190% రాబడి.. తగ్గేదేలే
కామధేను లిమిటెడ్ ఒక చిన్న నుంచి మధ్యస్థ పరిమాణ ఉక్కు కంపెనీ. ఈ స్టాక్‌ను పరిశీలిస్తే, కేవలం ఒకటిన్నర నెలల్లోనే, పెట్టుబడిదారులకు 190% రాబడిని ఇచ్చింది. అక్టోబర్ 25, 2022, అంటే దీపావళి మరుసటి రోజున, స్టాక్ రూ.129 వద్ద ట్రేడింగ్‌లో ఉండగా, డిసెంబర్ 15, 2022న నాటికి స్టాక్ రూ.374 వద్ద ట్రేడవుతోంది.

దీని ప్రకారం ఒక ఇన్వెస్టర్‌ అక్టోబర్ 25, 2022న కామధేను షేర్‌లను కొనుగోలు చేయడానికి రూ. 1 లక్ష పెట్టుబడి పెట్టుంటే,  వాటి ప్రస్తుత విలువ రూ.2.90 లక్షలకు పెరిగింది. అనగా ఇన్వెస్టర్లకు రూ. 1.90 లక్షల రిటర్న్స్‌ని ఇచ్చింది.దీపావళి నుంచి ఈ స్టాక్ రాకెట్‌గా దూసుకోపోయింది. అదే సమయంలో, కంపెనీ రెండేళ్లలో 246 శాతం, మూడేళ్లలో 314 శాతం రాబడిని ఇచ్చింది.

చదవండి: ధరలు పైపైకి.. ఆ ఇళ్లకు ఫుల్‌ డిమాండ్‌, అవే కావాలంటున్న ప్రజలు!

మరిన్ని వార్తలు