ప్లీజ్‌.. గర్భవతిని! నా పోర్న్‌ వీడియోల్ని తీసేయండి

29 Jun, 2021 14:25 IST|Sakshi

కెరీర్‌లో ఉన్నంత కాలం అవకాశాల కోసం ప్రయత్నిస్తూ.. రాణిస్తూ, ఆపై ఫేమ్‌ తెచ్చిన ఇండస్ట్రీపై విమర్శలు చేయడం అడల్ట్‌ స్టార్లకు అలవాటైన పనే. మియా ఖలీఫా, సన్నీ లియోన్‌ లాంటి మాజీ పోర్న్‌ స్టార్స్‌ వ్యతిరేక కామెంట్లు చేసిన వాళ్లే. ఇక ఇప్పుడు ఈ లిస్ట్‌లోకి చేరింది లానా రోడ్స్‌. 

చికాగో ఇల్లినాయిస్‌లో పుట్టిన పెరిగిన ఈ 25 ఏళ్ల మాజీ అడల్ట్‌ స్టార్‌ అసలు పేరు అమరా మాపుల్‌. టీనేజీలోనే పోర్న్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి లానా రోడ్స్‌గా ఫేమ్‌ సంపాదించుకుంది. మొదట మోడలింగ్‌, యూట్యూబ్‌, ఇన్‌ఫ్లుయెన్సర్‌గా పేరు సంపాదించుకుంది. 2016 అడల్ట్‌ సినిమాల్లోకి అడుగుపెట్టి.. రెండేళ్లపాటు స్టార్‌డమ్‌ను కొనసాగించింది.  కొంతకాలం క్రితం కెరీర్‌కు గుడ్‌బై చెప్పిన ఆమె.. ప్రస్తుతం హ్యారీ జోసే పాడ్‌కాస్ట్‌ ‘టాప్‌ ఇన్‌’లో పని చేస్తోంది. ఇక అప్పటి నుంచి ఇండస్ట్రీపై తరచూ విమర్శలు చేస్తోంది. తాజాగా తాను గర్భవతిని అనే బాంబ్‌ పేల్చిన లానా.. తన గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి వీడియోల్ని తొలగించాలని విజ్ఞప్తి చేస్తోంది.

 

‘‘ప్రస్తుతం నేను గర్భంతో ఉన్నా. నాకు పుట్టే బిడ్డకు నా గతం గురించి తెలిసినా.. ఆ జ్ఞాపకాలు అందకూడదనే అనుకుంటున్నా. అందుకే  నిజాయితీగా కోరుతున్నా. దయచేసి అడల్ట్‌ వెబ్‌సైట్లు ఆవీడియోలను తొలగించండి. అవకాశం దొరికితే నేనే కాలంలో వెనక్కి వెళ్తా. అలాంటి పనులకు దూరంగా ఉంటా. నా గౌరవాన్ని నేను కాపాడుకుంటా’’ అని పశ్చాత్తాప పడింది లానా. ఇక అంతేకాదు సెక్స్‌ వర్కర్స్‌తో ఇంటెరాక్షన్‌ ద్వారా.. వాళ్ల మానసిక సంఘర్షణను అందరికీ తెలియజేసేలా ప్రోగ్రామ్‌లు చేస్తోందామె. వాళ్లకు(అడల్ట్‌ వెబ్‌సైట్‌లకు) కొంత కాలం అవకాశం ఇవ్వాలనుకంటున్నా.. అవసరమైతే న్యాయపరమైన చర్యల దిశగా ఆలోచిస్తా అని చెప్తోంది లానా.

చదవండి: అడల్ట్‌ సినిమాలతో మియా ఖలీఫా సంపాదనెంతో తెలుసా?

 

ఇంతకీ తండ్రెవరు?
మైక్‌ మజ్‌లక్‌ అమెరికన్‌ నటుడు, పాపులర్‌ వ్లోగర్‌. లానా రోడ్స్‌తో చాలాకాలంగా రిలేషన్‌షిప్‌ కొనసాగించాడు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ.. కొన్ని నెలల క్రితం వీళ్లిద్దరూ విడిపోయారు. దీంతో లానా కడుపులో బిడ్డకు తండ్రి అతనేనా? అనే అనుమానం ఆమె అభిమానులకు వ్యక్తం అవుతోంది. అయితే ఈ ప్రశ్నకు ఆమె ‘బిడ్డ పుట్టాక డీఎన్‌ఏ టెస్ట్‌ చేస్తే తెలుస్తుంద’ని సరదా సమాధానం ఇచ్చింది.

చదవండి: పాక్‌ చేష్టలపై మియా ఖలీఫా ఫైర్‌

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు