తెలుగులో స్ట్రీమింగ్‌ కానున్న ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’

13 Aug, 2021 14:40 IST|Sakshi

‘ది ఫ్యామిలీ మ్యాన్‌’ వెబ్‌ సిరీస్‌లు దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలన విజయం సాధించాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓటీటీ వేదికగా విడుదలైన ఈ వెబ్‌ సిరీస్‌లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టున్నాయి. ఉగ్రవాదం నేపథ్యంలో తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌ ఆశించిన స్థాయి కంటే ఎక్కువగా విజయవంతమయ్యాయి. ఇక మొదటి సీజన్‌ సంచలన విజయంతో మేకర్స్‌ రెండవ సీజన్‌ను మరింత ఆసక్తిగా రూపొందించారు. ఇటీవల విడుదలైన ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ సిరీస్‌ రికార్డు స్టాయిలో విజయం సాధించింది. ఈ సీజన్‌ సమంత నటించడంతో తెలుగు ప్రేక్షకుల్లో సైతం భారీగా అంచనాలు నెలకొన్నాయి.  

దీంతో ‘ది ఫ్యామిలీ మ్యాన్‌ 2’ను తెలుగులో కూడా విడుదల చేయాలని మేకర్స్‌ ప్లాన్‌ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వెబ్‌ సిరీస్‌ విడుదలై రెండు నెలలు గడుస్తున్నా ఇంతవరకు తెలుగు వెర్షన్‌ విడుదల కాలేదు. తెలుగు ప్రేక్షకులు ఎప్పుడేఎప్పుడా అని కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. వారందరి ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ అమెజాన్‌ ప్రైం ఫ్యామిలీ మ్యాన్‌ 2ను విడుదల చేసేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. అయితే తేదీని మాత్రం ప్రకటించలేదు. కానీ తెలుగు ప్రేక్షకుల ఆసక్తి దృష్ట్యా త్వరలోనే స్ట్రీమింగ్‌ చేసేందుకు అమెజాన్‌ ప్లాన్‌ చేస్తుందట. ఈ సెకండ్‌ సీజన్‌లో బాలీవుడ్‌ నటుడు మనోజ్‌ భాజ్‌పాయి లీడ్‌రోల్‌లో నటించగా ప్రయమణి, సమంతలు కీలక పాత్రల్లో నటించారు. ఇందులో​ సమంత శ్రీలంక మహిళ టెర్రరిస్టుగా నటించింది. 

మరిన్ని వార్తలు