లైగర్‌ చిత్రంలో మాజీ బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌

27 Sep, 2021 16:29 IST|Sakshi

విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న పాన్‌ ఇండియా చిత్రం ‘లైగర్‌’. సాలా క్రాస్‌ బ్రీడ్‌ అనేది ఉపశీర్షిక.  పూరీ జగన్నాథ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో అనన్య పాండే హీరోయిన్‌గా నటిస్తోంది. పూరీ కనెక్ట్స్‌, ధర్మ ప్రొడెక్షన్స్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇందులో విజయ్‌ బాక్సర్‌గా అలరించబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో విజయ్‌ లుక్‌కు అదిరిపోయే రెస్పాన్స్‌ వచ్చింది. ఇదిలా ఉండగా తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

చదవండి: ఆకట్టుకుంటున్న ‘కొండపొలం’ ట్రైలర్‌, వైష్ణవ్‌ను ఆటపట్టిస్తున్న రకుల్‌..

లైగర్‌లో లెజెండరి మాజీ ఆటగాడు, బాక్సింగ్‌ చాంపియన్‌ మైక్‌ టైసన్‌ కీలక పాత్ర పోషిస్తున్నట్లు మేకర్స్‌ ప్రకటించారు. బాక్సింగ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో తెరకెక్కెన ఈ చిత్రంలో మైక్‌ టైసన్‌ క్లైమాక్స్‌ యాక్షన్‌ సీన్‌లో రింగ్‌లోకి దిగుతున్నట్లు మేకర్స్‌ స్పష్టం చేశారు. అమెరికాకు చెందిన మైక్‌ టైసన్‌.. బాక్సింగ్‌లో ఏడు సార్లు ప్ర‌ప‌చం ఛాంపియ‌న్‌గా నిలిచాడు. కింగ్ ఆఫ్ ద రింగ్‌గా ప్ర‌ఖ్యాతిగాంచి లెజండ‌రీ బాక్స‌ర్‌గా మైక్ గుర్తింపు పొందాడు. క్లైమాక్స్‌లో టైస‌న్ త‌న పంచ్‌ల‌తో అల‌రించ‌నున్నారు. మిక్స్‌డ్ మార్షియ‌ల్ ఆర్ట్స్ ఫైట‌ర్ క్యారెక్ట‌ర్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ లైగర్‌లో అలరించనున్నాడు. ప్రస్తుతం గోవాలో షూటింగ్‌ను జరపుకుంటున్న ఈ చిత్రం సెప్టెంబర్‌ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగు,హిందీ, తమిళం, కన్నడలో ఒకేసారి ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో బాలీవుడ్‌ నటుడు సునీల్‌ శెట్టి కీలక పాత్ర పోషిస్తుండగా.. సినీయర్‌ నటి రమ్యకృష్ణ కూడా ప్రధాన పాత్రలో కనిపించబోతుంది. 

మరిన్ని వార్తలు