‘గమనం’ నుంచి నిత్య ఫస్ట్‌ లుక్‌ అవుట్‌

18 Sep, 2020 16:13 IST|Sakshi

శ్రియ‌ 'సరన్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా గ‌మ‌నం. సునారావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు ఇళయరాజా స్వరాలు సమకూరుస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి శ్రియ ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌ను దర్శకుడు క్రిష్‌ జాగర్లముడి విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో శ్రియ చీర క‌ట్టుకొని, మెడ‌లో మంగ‌ళ‌సూత్రం ధరించి ఓసాధార‌ణ గృహిణిలా క‌నిపిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నిత్యామీన‌న్ ఫ‌స్ట్ లుక్‌ను టాలీవుడ్ నటుడు శ‌ర్వానంద్ ట్విటర్‌లో విడుద‌ల చేశారు. ‘గమనం నుంచి శైలపుత్రీదేవి(నిత్యామీనన్‌)ను పరిచయం చేస్తున్నాను. చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్‌ చేశారు.  (శ్రియ ‘గమనం’ ఎటువైపు..?)

ఈ సినిమాలో నిత్యా కర్ణాటక గాయకురాలు శైల‌పుత్రీ దేవి పాత్రలో కనిపించనున్నారు. ఇక సంప్రదాయ లుక్‌లో చీర కట్టుతో ఉన్న నిత్యా మీనన్‌ లుక్‌ అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది. ఈ సినిమాకు ప్రముఖ ర‌చ‌యిత సాయిమాధ‌వ్ బుర్రా మాటు స‌మ‌కూరుస్తుండగా.. జ్ఞాన‌శేఖ‌ర్ వి.ఎస్ సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. మేష్ క‌రుటూరి, వెంకీ పుష‌డ‌పు ల‌తో క‌లిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ‌, క‌న్నడ‌, మ‌ల‌యాళం, హిందీ భాష‌ల్లో రూపొందుతున్న ఈ చిత్రంలో నిత్యామీన‌న్‌, ప్రియాంకా జ‌వాల్కర్‌ శివ కందుకూరి కీల‌క పాత్రల్లో నటిస్తున్నారు.ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది చివరి నాటికి సినిమాను విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తోంది. (ఇది కామ్‌ టైమ్‌ఇది కామ్‌ టైమ్‌)

చదవండి : సప్త సముద్రాల ఆవల ఉన్నా సరే..

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా