'గంగులు' సాంగ్‌.. యాంకర్‌ విష్ణుప్రియ డ్యాన్స్ అదరహో

12 Apr, 2023 07:10 IST|Sakshi

యాంకర్‌ విష్ణు ప్రియ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.  షార్ట్ ఫిల్మ్స్ ద్వారా గుర్తింపు పొందిన భామ.. సుడిగాలి సుధీర్‌తో కలిసి ఓ షోకు యాంకర్‌గా బుల్లితెరపై రాణించింది. మరోవైపు సోషల్ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ట్‌ హాట్‌హాట్‌ ఫొటోలను షేర్‌ చేస్తూ సోషల్‌ మీడియా షేక్‌ చేస్తోంది. గతంలో మానస్‌తో కలిసి ఓ పాటకు స్టెప్పులేసిన ముద్దుగుమ్మ మరోసారి సందడి చేసింది.

బిగ్ బాస్ ఫేమ్ మానస్, విష్ణు ప్రియ కలిసి డ్యాన్స్ చేసిన ‘గంగులు’ అనే జానపద సాంగ్ తాజాగా రిలీజ్ చేశారు. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో  అదరగొడుతోంది. ఈ పాటకు మానస్, విష్ణుప్రియ అదిరిపోయే స్టెప్పులతో ఆకట్టుకున్నారు. ఈ సాంగ్‌కు భీమ్స్ సిసిరిలియో సంగీతం అందించగా.. జానీ మాస్టర్ శిష్యురాలు శ్రష్టి వర్మ నృత్య దర్శకత్వం వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్, పద్మిని నాగులపల్లి, ప్రముఖ నిర్మాత జయతి పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు