Geeta Basra: .'సెలబ్రిటీలకు కష్టాలు ఉంటాయా అనుకుంటారు'

28 Sep, 2021 11:31 IST|Sakshi

Geeta Basra Reveals Why She Spoke About Her Miscarriages: టీమిండియా వెటరన్‌ క్రికెటర్‌ హర్భజన్ సింగ్‌ భార్య, నటి గీతా బస్రా ఇటీవలె రెండోసారి పండంటి బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. కుమారుడి రాకతో మరోసారి మాతృత్వాన్ని అనుభవించిన ఆమె గతంలో రెండుసార్లు గర్భస్రావానికి గురైంది. తాజాగా ఈ విషయం గురించి సోషల్‌ మీడియాలో ఓపెన్‌ అప్‌ అయ్యింది. 'ప్రతి మహిళ తను ప్రెగ్నెంట్‌ అని తెలిసిన రోజు నుంచి వచ్చే తొమ్మిది నెలల కోసం ఎంతో ఎదురు చూస్తుంటుంది.  ఎప్పుడెప్పుడు చిన్నారిని తమ చేతుల్లోకి తీసుకొని ముద్దు చేద్దామా అని కలలు కంటుంది. కానీ  దురదృష్టవశాత్తూ అలాంటి సమయంలో మిస్‌ క్యారేజ్‌(గర్భస్రావం) జరిగితే జీవితమే ​కోల్పోయినట్లు అనిపిస్తుంది.

నా స్నేహితుల్లో కూడా కొందిరికి ఇలానే జరిగింది. నేను కూడా దీన్ని అనుభవించాను. మొదటిసారి పాప హీర్‌ పుట్టాక రెండు సార్లు  నాకు గర్భస్రావం అయ్యింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్‌కు లోనయ్యా. రెండుసార్లు వరుసగా అబార్షన్‌ కావడంతో ఎంతో బాధపడ్డా. అయితే ఆ సమయంలో నా భర్త నాకు తోడుగా నిలిచారు. చాలామంది అనుకొంటారు సెలబ్రిటీలకు ఏముంటుంది? వాళ్ల జీవితం చాలా సాఫీగా గడుస్తుంది అని కానీ కానీ ప్రతి సెలబ్రిటీ జీవితం అంత సులభం కాదు. వాళ్లకూ అందరిలానే కష్టాలు ఉంటాయి. అమ్మతనం ఆస్వాదించాలనుకున్న వారికి గర్భస్రావం ఓ పీడకలలా మారుతుంది.

దీన్నుంచి కోలుకోవడం అంత సులభమేమీ కాదు కానీ అసాధ్యం అయితే కాదు. ఈ ప్రతికూల పరిస్థితుల నుంచి భయటపడేందుకు ప్రయత్నించాలి. ఆశను వదులుకోకూడదు అన్న ధైర్యాన్ని నింపేందుకు నేను నా అనుభవాల్ని పంచుకున్నాను. ఈ విషయాల గురించి మాట్లాడటం ఎంత ముఖ్యమో నేను తెలుసుకున్నాను. దీనికి సోషల్‌ మీడియాను మించిన బెస్ట్‌ ఫ్లాట్‌ ఫాం లేదనిపించింది. ఎట్టి పరిస్థిత్లుల్లోనూ నమ్మకాన్ని కోల్పోకూడదు' అంటూ మహిళల్లో ఎంతో స్పూర్తి నింపింది. కాగా ‘ద ట్రైన్‌’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న గీత  బస్రా 2015లో టీమిండియా మాజీ క్రికెటర్‌ హర్భజన్‌సింగ్‌తో కలిసి ఏడడుగులు వేసింది.  2016 లో ఈ దంపతులు మొదటిసారిగా తల్లిదండ్రులయ్యారు. ఆ పాపకు హీర్ ప్లాహా అనే పేరు పెట్టారు.  అనంతరం ఈ ఏడాది జోవన్‌ వీర్‌ సింగ్‌ ప్లాహా అనే బాబు పుట్టాడు. 

మరిన్ని వార్తలు