Guneet Monga: లేటు వయసులో లేడీ ప్రొడ్యూసర్‌ పెళ్లి, ఫొటోలు వైరల్‌

12 Dec, 2022 20:28 IST|Sakshi

బాలీవుడ్‌ నిర్మాత గునీత్‌ మోంగా పెళ్లిపీటలెక్కారు. ప్రియుడు సన్నీ కపూర్‌ను పెళ్లామాడారు. సిక్కు సాంప్రదాయం ప్రకారం గురుద్వారలో సోమవారం వీరి వివాహం ఘనంగా జరిగింది. నిండైన అలంకరణతో పెళ్లి వస్త్రాలు ధరించిన నూతన వధూవరులు గురుద్వార్‌ ప్రాంగణంలో ఫోటోలకు పోజిచ్చారు. ఇక ఇండస్ట్రీ మిత్రుల కోసం గునీత్‌ ఆదివారం ప్రీవెడ్డింగ్‌ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో విద్యాబాలన్‌, సోనాలీ బింద్రే, పాత్రలేఖ, నీనా గుప్తా, రియా చక్రవర్తి సహా తదితరులు హాజరై సందడి చేశారు. 

కాగా గునీత్‌ మోంగాకు సొంతంగా సిఖ్యా ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రొడక్షన్‌ హౌస్‌ ఉంది. ఈ బ్యానర్‌ నుంచి షాహిద్‌, మసాన్‌, గ్యాంగ్స్‌ ఆఫ్‌ వాసీపూర్‌ వంటి ఎన్నో చిత్రాలను నిర్మించారు. ఇక సన్నీకపూర్‌ విషయానికి వస్తే అతడొక ఎంటర్‌ప్రెన్యూర్‌ అని తెలుస్తోంది. ఇతడు మీనాక్షి ఎంటర్‌ప్రైజెస్‌ కంపెనీ యజమాని. అలాగే గతంలో జరిగిన మారథాన్‌ పోటీల్లో రన్నర్‌గా నిలిచాడు.

A post shared by Guneet Monga Kapoor (@guneetmonga)

చదవండి: ఆమె వల్లే అన్నీ కోల్పోయా: నోరా ఫతేహి
అమర్‌తేజుల హల్దీ ఫంక్షన్‌, ఫొటోలు వైరల్‌

మరిన్ని వార్తలు