యువత 'గుట్టు చప్పుడు'

29 May, 2021 12:37 IST|Sakshi

నటుడు బ్రహ్మాజీ తనయుడు, ‘ఓ పిట్ట కథ’ ఫేమ్‌ సంజయ్‌ రావ్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘గుట్టు చప్పుడు’. మణీంద్రన్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని లివింగ్‌ స్టన్‌ నిర్మిస్తున్నారు. నేడు సంజయ్‌ రావ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌తో పాటు మోషన్‌ పోస్టర్‌ని సంతోషం స్టూడియోలో ఆవిష్కరించారు. సంజయ్‌ రావ్‌ మాట్లాడుతూ– ‘‘పక్కా మాస్‌ అండ్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘గుట్టు చప్పుడు’ సినిమా నాకు చాలా మంచి ఇమేజ్‌ తెస్తుంది’’ అన్నారు.

లివింగ్‌ స్టన్‌ మాట్లాడుతూ– ‘‘నేను, మణీంద్రన్‌ చాలా కాలంగా ఫ్రెండ్స్‌. మా కాంబినేషన్‌లో సినిమా చేయాలను కున్నప్పుడు ‘గుట్టు చప్పుడు’ కథ బాగా నచ్చింది. రెండు షెడ్యూల్స్‌ చిత్రీకరించాల్సి ఉంది’’ అన్నారు. మణీంద్రన్‌ మాట్లాడుతూ– ‘‘వైజాగ్‌ నేపథ్యంలో ఈ చిత్రకథ సాగుతుంది. నేటి పరిస్థితులకు అద్దం పట్టేలా, ముఖ్యంగా యూత్‌ని బేస్‌ చేసుకుని చేస్తున్న సినిమా ఇది’’ అన్నారు. కెమెరామ్యాన్‌ రాము, మ్యూజిక్‌ డైరెక్టర్‌ గౌర హరి, మాటల రచయిత సురేష్‌ కుమార్‌ తదితరులు మాట్లాడారు. ఈ చిత్రానికి కెమెరా: రాము సీఎం, సంగీతం: గౌర హరి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు