అదృశ్య శక్తితో పోరాటం

31 Jan, 2023 05:35 IST|Sakshi

హీరోయిన్‌ హన్సిక ఒకే ఒక పాత్రలో నటించిన చిత్రం ‘వన్‌ నాట్‌ ఫైవ్‌ మినిట్స్‌’.  రాజు దుస్సా దర్శకత్వంలో బొమ్మక్‌ శివ నిర్మించిన ఈ సినిమా త్వరలో రిలీజ్‌ కానుంది. దర్శక–నిర్మాతలు మాట్లా డుతూ–‘‘హాలీవుడ్‌లో సింగిల్‌ షాట్‌ టెక్నిక్‌లో తెరకెక్కిన ‘బర్డ్‌ మన్, 1917’ చిత్రాల తరహాలో ‘వన్‌ నాట్‌ ఫైవ్‌ మినిట్స్‌’ తీశాం. సైకలాజికల్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. రీల్‌ టైమ్, రియల్‌ టైమ్‌ ఒకేలా ఉండి ప్రేక్షకులు కూడా ఆ సీన్‌లో ప్రత్యక్షంగా ఉన్నట్లు అనుభూతి చెందుతారు.

ఈ చిత్రానికి గ్రీన్‌ మ్యాట్‌ వాడకుండా లైవ్‌గా చిత్రీకరించి గ్రాఫిక్స్‌ యాడ్‌ చేశాం. ఒక అదృశ్య శక్తి నుండి తనను తాను కాపాడుకునే అమ్మాయిగా ప్రతి షాట్‌లో అద్భుతమైన హావభావాలు పలికించారు హన్సిక’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్‌ సీఎస్, కెమెరా: కిషోర్‌ బోయిదాపు, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌–స్క్రిప్ట్‌ చీఫ్‌ అసోసియేట్‌: రూపకిరణ్‌ గంజి, సహ నిర్మాత: బొమ్మక్‌ యషిత.

మరిన్ని వార్తలు