లారెన్స్‌ సినిమా నుంచి వాకౌట్‌? 

9 Oct, 2023 00:25 IST|Sakshi
నయనతార

లేడీ సూపర్‌ స్టార్‌గా పేరు తెచ్చుకున్న నయనతార లేడీ ఓరియంటెడ్‌ మూవీస్‌తో పాటు రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాల్లో హీరోల సరసన నటిస్తుంటారు. దక్షిణాదిన సక్సెస్‌ఫుల్‌ హీరోయిన్‌ అనిపించుకున్న నయన ‘జవాన్‌’ వంటి బ్లాక్‌ బస్టర్‌ హిట్‌తో హిందీ పరిశ్రమలోనూ విజయవంతంగా కెరీర్‌ ఆరంభించారు.

ఇక ప్రస్తుతం  ‘ది టెస్ట్‌’ చిత్రంతో పాటు మరో చిత్రంలో కథానాయికగా నటిస్తున్నారు నయనతార. కాగా, రత్నకుమార్‌ దర్శకత్వంలో లారెన్స్‌ హీరోగా రూపొందనున్న చిత్రంలో ఈ బ్యూటీ హీరోయిన్‌గా ఖరారయ్యారనే వార్త  వినిపించింది. తాజాగా ఈ చిత్రం నుంచి ఆమె తప్పుకున్నారని టాక్‌. డేట్స్‌ సర్దుబాటు చేయలేక నయన ఈ నిర్ణయం తీసుకున్నారని సమాచారం. 

మరిన్ని వార్తలు