'ఆ ఫోటోలు పెడుతున్నారు..కొంచెమైనా సిగ్గుండాలి'

26 Apr, 2021 08:26 IST|Sakshi

న‌ట‌న త‌ప్పా ఇంకేమీ మాల్లాడ‌లేరు : న‌వాజుద్దీన్‌

బాలీవుడ్ సెల‌బ్రిటీల వెకేష‌న్ ట్రిప్పుల‌పై న‌వాజుద్దీన్ ఫైర్‌ 

ముంబై :‌‌ ఓ వైపు  దేశ‌మంతా క‌రోనాతో ప్ర‌జ‌లు అల్లాడుతుంటే బాలీవుడ్ సెల‌బ్రిటీలు మాత్రం త‌మ ఎంజాయ్‌మెంట్‌కే ప్రాధాన్య‌త ఇస్తున్నారు.  సెలబ్రిటీలు మాత్రం వినోదాల కోసం విదేశాలకు వాలిపోతున్న సంగ‌తి తెలిసిందే. హాలీడే ట్రిప్పుల పేరుతో ప్రేమపక్షులు మాల్దీవుల బీచుల్లో ఫుల్లుగా ఎంజాయ్ చేస్తూ ఫోటోల‌కు ఫోజులిస్తున్నారు.  ఇటీవలె  అలియా భట్‌, రణ్‌బీర్‌ కపూర్‌, దిషా పటాని-టైగర్‌ ష్రాఫ్ హాలీడే ఎంజాయ్‌ చేయడం కోసం మాల్దీవులు చెక్కేసిన సంగతి తెలిసిందే. వీరి హాలిడే  ట్రిప్‌పై నెటి తీవ్ర విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ‘‘కాస్త అయిన బాధ్యత ఉండక్కర్లేదా.. ఓ వైపు దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. మీకు టూర్లు కావాల్సి వచ్చిందా’’అంటూ ట్రోల్స్‌ చేస్తున్నారు.

తాజాగా విష‌యంపై బాలీవుడ్ న‌టుడు న‌వాజుద్దీన్ స్పందించారు. ఇప్పడు ప్ర‌పంచ‌మంతా కరోనా కోర‌ల్లో చిక్కుకుంది. మ‌న దేశంలో ప‌రిస్థితి ఇంకా దారుణంగా ఉంది. క‌నీసం తిన‌డానికి తిండి కూడా లేకుండా ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డుతుంటే వీళ్లు మాత్రం త‌మ జ‌ల్సాల కోసం డ‌బ్బుల‌ను నీళ్ల‌లా ఖ‌ర్చుపెడుతున్నారు. ఓ వైపు దేశం ఆర్థిక మాంద్యంలో కూరుకుపోతుంటే...వీరు మాత్రం వెకేష‌న్ ట్రిప్పులను ఎంజాయ్ చేస్తూ ఆ ఫోటోలు పెడుతున్నారు. కొంచెం అయినా సిగ్గుండాలి. వీళ్లు యాక్టింగ్ గురించి త‌ప్పా ఇంకేమీ మాట్లాడ‌లేరు అంటూ బాలీవుడ్ సెల‌బ్రిటీల‌పై తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. దేశంలో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోతున్నాయ‌ని, అంద‌రూ జాగ్ర‌త్త‌లు పాటించాల‌ని కోరారు. ఒక త‌న వెకేష‌న్ గురించి మాట్లాడుతూ..తాను బుధానాలోని త‌న కుటుంబంతో స‌మ‌యం గ‌డుపుతున్నానని, ఇదే త‌న‌కు మాల్దీవులు అని చెప్పుకొచ్చారు. 

చ‌ద‌వండి : అయినా ఇప్పుడు ట్రిప్పులు ఏంటి : శృతి హాసన్‌ 
‘‘ఓ పక్క జనాలు చస్తుంటే.. మీరు ట్రిప్పులకు వెళ్తారా?’’

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు