‘ఛత్రపతి’ కోసం రూ.3 కోట్లతో ఆరు ఎకరాల్లో భారీ సెట్‌!

4 Jun, 2021 00:58 IST|Sakshi

అకాల వర్షాలతో దెబ్బతిన్న భారీ సెట్‌

సెట్‌ను పునరుద్ధరించే పనిలోపడ్డ ‘ఛత్రపతి’టీమ్‌

ప్రభాస్‌ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో 2005లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత హిట్‌ అయ్యిందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ హీరోగా ఈ సినిమా హిందీలో రీమేక్‌ కానుంది. వీవీ వినాయక్‌ దర్శకత్వంలో డా. జయంతి లాల్‌ గడ ఈ రీమేక్‌ని నిర్మించనున్నారు. తెలుగు ‘ఛత్రపతి’కి కథ అందించిన విజయేంద్రప్రసాద్‌  హిందీకి తగ్గట్టు కొన్ని మార్పులతో కథను తయారు చేస్తున్నారట.

ఈ చిత్రం కోసం హైదరాబాద్‌లో 3 కోట్ల భారీ బడ్జెట్‌తో ఆరు ఎకరాల్లో ఆర్ట్‌ డైరెక్టర్‌ సునీల్‌బాబు ఓ విలేజ్‌ సెట్‌ను ఏర్పాటు చేశారు. ఏప్రిల్‌ 22న షూటింగ్‌ ఆరంభం కావాల్సి ఉండగా కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగా వాయిదా పడింది. ఈలోపు అకాల వర్షాల వల్ల ఈ సెట్‌ బాగా దెబ్బతింది. దీంతో ఈ సెట్‌ను పునరుద్ధరించే పనిలో పడ్డారు. ఈ సెట్‌ని మళ్లీ సెట్‌ చేసి, కోవిడ్‌ పరిస్థితులు చక్కబడ్డాక షూటింగ్‌ను ప్రారంభించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు