Hero Nani : నాని దసరా మూవీ నుంచి లేటెస్ట్‌ అప్‌డేట్‌..

4 Mar, 2023 16:12 IST|Sakshi

నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా నటిస్తున్న చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్‌ లుక్‌లో కనిపించనున్నారు. కీర్తి సురేష్‌ ఇందులో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. సింగరేణి కోల్ మైన్స్ బ్యాక్ డ్రాప్ లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

తెలుగుతో పాటుగా, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పటికే ప్రమోషన్స్‌ ప్రారంభించిన మేకర్స్‌ తాజాగా ఈ సినిమాలోని 'చమ్కీల అంగీలేసి’ అనే మూడో పాటను ఈనెల 8న రిలీజ్‌ చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. 

మరిన్ని వార్తలు