ఆ అమ్మాయిని చూడగానే ప్రేమలో పడ్డా..ప్రస్తుతం తనే నా క్రష్‌: నాని

23 Sep, 2023 13:02 IST|Sakshi

మీడియాతో అయినా, అభిమానులతో అయినా సరదాగా మాట్లాడే అది కొద్ది మంది హీరోలలో నాని ఒకరు. ఏ విషయాన్ని అయినా అభిమానులతో షేర్‌ చేసుకుంటాడు. మీడియాతో కూడా అంతే. పర్సనల్‌ విషయాలను అడిగినా.. చెప్పను..కుదరదు అని అనడు. చాలా జన్యూన్‌గా జవాబిస్తాడు. తాజాగా ఆయన తొలి ప్రేమ అనుభవాన్ని రేడియో జాకీలతో షేర్‌ చేసుకున్నాడు.

మృనాల్‌ ఠాకూర్‌, నాని జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘హాయ్‌ నాన్న’. శౌర్యువ్‌ దర్శకత్వంలో మోహన్‌ చెరుకూరి (సీవీఎం), డా. విజయేందర్‌ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ చిత్రంలో బేబీ కియారా ఖన్నా కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 21న విడుదల చేయనున్నారు. మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా నాని ఇటీవల రేడియో జాకీలతో కలిసి చిట్‌చాట్‌ నిర్వహించాడు. ఈ సందర్భంగా ఆయన ప్రేమలో ఎప్పుడు పడ్డాడో.. ప్రస్తుతం తన క్రష్‌ ఎవరో చెప్పి అందరినీ ఆశ్చర్య పరిచాడు. 

‘నేను మూడో తరగతిలోనే ప్రేమలో పడ్డాను. అప్పుడు ఫ్యాన్సీ డ్రెస్‌ పోటీల్లో సోనీ అనే అమ్మాయి మంచి గౌను వేసుకొని వచ్చింది. నేను ఏమో ఆకులు చుట్టుకుని నిలబడ్డాను. ఆమెను చూడగానే నాకు వెళ్లి పకలరించాలని అనిపించింది. కానీ ఆకులు చుట్టుకున్నాననే సిగ్గుతో ఆమె దగ్గరకు వెళ్లలేదు. ఇప్పుడు ఆ అమ్మాయి కనిపిస్తే.. వెళ్లి పలకరిస్తాను’అని సరదగా చెప్పాడు.  ప్రస్తుతం తన క్రష్‌ కియారా ఖన్నా(హాయ్‌  నాన్న చైల్డ్‌ ఆర్టిస్ట్‌) అని చెపన్పాడు. ‘ఒక్కరోజు కియారా ఖన్న చక్కగా రెడీ అయి సెట్‌కి వచ్చింది. చూడగానే ముచ్చటగా అనిపించింది. ప్రస్తుతం తనే నా క్రష్‌’అని నాని చెప్పుకొచ్చాడు. 

మరిన్ని వార్తలు