-
హాయ్ నాన్నకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.. బెస్ట్ ఫీచర్ ఫిలింగా..
నాని, మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ మూవీ "హాయ్ నాన్న". అంతర్జాతీయంగా "హాయ్ డాడ్"గా విడుదలైన ఈ చిత్రం ప్రతిష్టాత్మక ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ మార్చ్ 2024 ఎడిషన్‌లో బెస్ట్ ఫీచర్ ఫిలింగా అవార్డును కైవసం చేసుకుంది. డైరెక్టర్ శౌర్యువ్ దర్శకత్వం వహించిన "హాయ్ నాన్న" కథనం, నటీనటుల పర్ఫామెన్స్ న్యాయనిర్ణేతలను ఆకర్షించింది. శౌర్యువ్ మాట్లాడుతూ.. 'ఏథెన్స్ ఇంటర్నేషనల్ ఆర్ట్ ఫిలిం ఫెస్టివల్లో లభించిన ఈ గుర్తింపు మా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి. సాంస్కృతిక సరిహద్దులను అధిగమించి, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులతో కనెక్ట్ అయ్యిందీ మూవీ. 'హాయ్ నాన్న'కి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా, గౌరవంగా ఉంది. ఫెస్టివల్ నిర్వాహకులకు, జ్యూరీకి, 'హాయ్ నాన్నా'కి ప్రాణం పోసిన మా బృందానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను"అన్నారు. Hi Nanna celebrations continue across all corners! 💥💥#HiNanna released as #HiDad and received the prestigious award for Best Feature Film at the esteemed Athens International Art Film Festival in their March 2024 edition ❤️🔥 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN… pic.twitter.com/Yu2AtVdPTW — Vyra Entertainments (@VyraEnts) April 6, 2024 చదవండి: నన్ను వాడుకుని వదిలేశారు.. డబ్బులు కూడా ఇవ్వలేదు.. కళ్లు తెరిపించారు! -
OTTలో దుమ్ము లేపుతున్న మూవీ.. ఏకంగా మూడు స్థానాల్లో ట్రెండింగ్!
నేచురల్ స్టార్ నాని సినిమా అంటే మినిమమ్ ఉంటది మరి! ఎమోషనల్ యాక్టింగ్‌తో ఏడిపించే టాలెంట్ నాని సొంతం. ఆయన ఎంచుకునే కథ, కాన్సెప్ట్ అన్నీ కొత్తగా ఉండాల్సిందే! ఇప్పుడు చెప్పుకునే సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. నాని హీరోగా నటించిన తాజా చిత్రం హాయ్ నాన్న. సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించింది. తండ్రీకూతుళ్ల ప్రేమ కథను అందంగా, హృద్యంగా ఆవిష్కరించాడు డైరెక్టర్ శౌర్యువ్. ఓటీటీలోనూ ట్రెండింగ్ డిసెంబర్ 22న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం రూ.75 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. అయితే ముందుగా అగ్రిమెంట్ చేసుకున్నందుకో ఏమో కానీ.. థియేటర్లలో ఆడుతుండగానే ఓటీటీలో రిలీజ్ చేశారు. అలా హాయ్ నాన్న ఈ నెల 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వచ్చేసింది. బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓటీటీలోనూ దుమ్ము దులిపేస్తోంది. ఆదివారం నాడు(జనవరి 7న) ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో మొదటి స్థానంలో ట్రెండ్ అవుతోంది. టాప్ 10లో మూడు స్థానాలు హాయ్ నాన్నదే! హాయ్ నాన్న తెలుగు వర్షన్ మొదటి స్థానంలో, హిందీ వర్షన్ ఐదో స్థానంలో, తమిళ వర్షన్ 10వ స్థానంలో ట్రెండ్ అవుతోంది. అంటే టాప్ 10లో మూడు స్థానాల్లో హాయ్ నాన్నే ఉండటం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ వైరా ఎంటర్టైన్మెంట్స్ సోషల్ మీడియాలో వెల్లడించింది. హాయ్ నాన్న నెట్‌ఫ్లిక్స్‌లో తనదైన మార్క్ చూపిస్తోంది అని రాసుకొచ్చింది. మరి మీరు ఇంతవరకు హాయ్ నాన్న చూడకపోయుంటే ఓసారి వీలు చూసుకుని లుక్కేయండి.. The heartwarming tale transcends languages and bringing love to every corner 😍🔥#HiNanna is making its mark on the @NetflixIndia Trending charts! 🤘 Enjoy this blockbuster with your family at home today! 🤩 Natural 🌟 @NameIsNani @Mrunal0801 @PriyadarshiPN @shouryuv… pic.twitter.com/pJx4Lgfjiu — Vyra Entertainments (@VyraEnts) January 7, 2024 చదవండి: రెండో పెళ్లికి సిద్ధమైన సిద్ధార్థ్.. మొదటి భార్య ఎవరో తెలుసా? కోట్లు సంపాదించిన కమెడియన్..ఆ ఒక్క పొరపాటుతో జీవితమే అస్తవ్యస్తం.. చివరకు డిక్కీలో శవం! -
హాయ్ నాన్న మూవీ సమయమా సాంగ్
-
ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీ.. ఎక్కడంటే?
నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్న. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ మూవీని మోహన్ చెరుకూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల నిర్మించారు. ఈ సినిమా చూస్తే ప్రేక్షకులకు హాయిగా ఉంటుందని, జనాలకు తప్పకుండా నచ్చుతుందన్నాడు. అతడి నమ్మకం నిజమైంది. సినీప్రియులు హాయ్ నాన్నకు జై కొట్టారు. తండ్రీకూతుళ్ల ఎమోషన్‌కు కనెక్ట్ అయ్యారు. భారీ బడ్జెట్ సినిమాలైన యానిమల్, సలార్ పోటీని తట్టుకుని హాయ్ నాన్న ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్లకు పైగా రాబట్టింది. అక్కడే ఈ సినిమా ఘన విజయం సాధించేసింది. తాజాగా ఈ మూవీ ఓటీటీలోకి వచ్చింది. ముందుగా ప్రకటించిన తేదీ ప్రకారం నేటి (జనవరి 4) నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాను చూడటం మిస్ అయినవారు, మరోసారి హాయ్ నాన్న చూడాలనుకునేవారు ఎంచక్కా ఓటీటీలో వీక్షించేయండి.. కథ విషయానికి వస్తే.. ముంబైకి చెందిన విరాజ్ (నాని) ఓ ఫోటోగ్రాఫర్. కూతురు మహి(బేబి కియారా ఖన్నా) అంటే అతడికి పంచప్రాణాలు. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న మహిని కంటికి రెప్పలా చూసుకుంటాడు. అమ్మ లేని లోటు తెలియకుండా పెంచుతాడు. ప్రతిరోజు రాత్రి మహికి కథలు చెప్తుంటాడు విరాజ్. ఓరోజు అమ్మ కథ చెప్పమని అడుగుతుంది మహి. క్లాస్ ఫస్ట్ వస్తే చెప్తానంటాడు. అమ్మ కథ వినాలని నెలంతా కష్టపడి క్లాస్‌లో తనే ఫస్ట్ ర్యాంకు తెచ్చుకుంటుంది. తర్వాత కథ చెప్పమని అడిగితే విరాజ్ చిరాకు పడటంతో మహి ఇంట్లో నుంచి బయటకు వెళ్తుంది. ఆ సమయంలో రోడ్డు ప్రమాదం నుంచి మహిని కాపాడుతుంది యష్ణ. అప్పటినుంచి వీరి మధ్య స్నేహం ఏర్పడుతుంది. అసలు యష్ణ ఎవరు? విరాజ్ సింగిల్ పేరెంట్‌గా ఎందుకు మారాడు? మహి అరుదైన వ్యాధిని జయించిందా? లేదా? అన్నది ఓటీటీలో చూడాల్సిందే! చదవండి: ఆహా.. బయలుదేరిందయ్యా.. కీర్తి పోస్ట్ చూశారా? -
OTT Releases This Week: ఈ వీకెండ్ ఓటీటీల్లో ఏకంగా 20 సినిమాలు!
సినీ ఆడియన్స్ ప్రస్తుతం ఓటీటీల పైనే ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. వచ్చే వారంలో సంక్రాంతి సందడి మొదలు కానుంది. ఇప్పటికే పొంగల్‌కు స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు రెడీ అయిపోయాయి. ఈ వారంలో దాదాపు థియేటర్లలో చిన్న సినిమాలు మాత్రం రిలీజ్ కానున్నాయి. దీంతో ప్రేక్షకులు ఓటీటీల్లో ఏయే చిత్రాలు వస్తున్నాయో తెలుసుకోవాలనే ఆరాటంతో ఉన్నారు. ఈ వీకెండ్లో మిమ్మల్ని అలరించేందుకు పలు చిత్రాలు ఓటీటీకి వచ్చేస్తున్నాయి. అయితే ఈ వారంలో హాయ్ నాన్న, కంజూరింగ్ కన్నప్పన్, తేజస్, మెగ్ -2 లాంటి సినిమాలు కాస్తా ఆసక్తిని పెంచుతున్నాయి. ఇంతకీ ఏ సినిమా ఏ ఓటీటీకీ రానుందో ఓ లుక్కేద్దాం. ఈ వీకెండ్లో ఓటీటీల్లో స్ట్రీమింగ్ అయ్యే మూవీస్ నెట్‌ఫ్లిక్స్ డెలిషియస్ ఇన్ డంజన్ (జపనీస్ సిరీస్) - జనవరి 04 హాయ్ నాన్న (తెలుగు సినిమా) - జనవరి 04 సొసైటీ ఆఫ్ ద స్నో (స్పానిష్ మూవీ) - జనవరి 04 ద బ్రదర్స్ సన్ (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 04 కంజూరింగ్ కన్నప్పన్ (తెలుగు డబ్బింగ్ చిత్రం) - జనవరి 05 గుడ్ గ్రీఫ్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియోంగ్‌సోంగ్ క్రియేచర్ పార్ట్ 2(దక్షిణ కొరియా సిరీస్)- జనవరి 5 డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఇషురా (జపనీస్ సిరీస్) - జనవరి 03 పెరిల్లార్ ప్రీమియర్ లీగ్ (మలయాళం సిరీస్) - జనవరి 05 అమెజాన్ ప్రైమ్ ఫో (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 జేమ్స్ మే: అవర్ మెయిన్ ఇన్ ఇండియా (ఇంగ్లీష్ సిరీస్) - జనవరి 05 లాల్ లాస్ట్ వన్ లాఫింగ్ క్యూబిక్: సీజన్ 2 (ఫ్రెంచ్ సిరీస్) - జనవరి 05 జీ5 తేజస్ (హిందీ మూవీ) - జనవరి 05 బుక్ మై షో ఏ సావన్నా హాంటింగ్ (ఇంగ్లీష్ మూవీ) - జనవరి 05 ద మార్ష్ కింగ్స్ డాటర్ (ఇంగ్లీష్ చిత్రం) - జనవరి 05 వేర్ హౌస్ వన్ (ఇంగ్లీష్ సినిమా) - జనవరి 05 జియో సినిమా మెగ్ 2: ద ట్రెంచ్ (తెలుగు డబ్బింగ్ మూవీ) - జనవరి 03 సోనీ లివ్ క్యూబికల్: సీజన్ 3 (హిందీ సిరీస్) - జనవరి 05 సైనా ప్లే ఉడాల్ (మలయాళ సినిమా) - జనవరి 05 క్రంచీ రోల్ సోలో లెవెలింగ్- (సౌత్ కొరియా సిరీస్)- జనవరి 6
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్‌లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్‌తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మెగాఫోన్ పట్టిన జనతా గ్యారేజ్ నటుడు.. ఆసక్తిగా మూవీ టైటిల్!
స్కూలు బస్సులు కండిషన్లో ఉండాలి
బహిరంగ ప్రదేశాల్లో పెంపుడు శునకాలపై ఆంక్షలు
అనల్ అరసు నామినేట్
ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
నల్లజర్లలో అర్ధరాత్రి టీడీపీ బరితెగింపు
ఆత్మవిశ్వాసం + మనోధైర్యం..
సేవాభావం పెంపొందించుకోవాలి
భక్తిశ్రద్ధలతో శివాలయాల్లో ప్రదోష పూజలు
యువన్ శంకర్‌రాజా ఇండిపెండెంట్ మ్యూజికల్ ఆల్బమ్
తప్పక చదవండి
- దుబాయ్ నుంచి సెలవుపై వచ్చి ఆంబులెన్స్ ఢీ కొట్టి..
- ఎన్నికల బరిలో బిగ్ బాస్ ‘ఖాన్’.. ఎవరితో సై అంటున్నారు?
- Rafah: ఇజ్రాయెల్ దుందుడుకు చర్య.. ఐరాస ఆందోళన
- Arya 20 Years Celebrations: ‘ఆర్య’ సినిమా 20 ఇయర్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
- లగ్జరీ కారు కొనుగోలు చేసిన బుల్లితెర నటి..!
- అవినీతి ‘కాలువ’
- AP: పిడుగులుపడి ఏడుగురు మృత్యువాత
- Telangana: మరో రెండు రోజులు వానలు
- పథకాలను అడ్డుకున్నా.. గెలుపును ఆపలేరు: సీఎం వైఎస్ జగన్
- Madakasira: లోకలా.. నాన్ లోకలా?
Advertisement