18 ఏళ్లకే ఫస్ట్‌ కిస్‌.. డేటింగ్‌ మాత్రం..

3 Mar, 2021 11:18 IST|Sakshi

పరిణీతి చోప్రా ముఖ్య పాత్రలో నటించిన తాజా హిందీ చిత్రం ‘ది గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’. ఓటీటీలో ఫిబ్రవరి 26న ఈ సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఓ ఇంటర్వ్యూలో తన పర్సనల్‌ లైఫ్‌ గురించి కొన్ని ముఖ్య విషయాలను పంచుకుంది ఈ భామ. తనకి 18 ఏళ్లు ఉన్నప్పుడే ఓ అబ్బాయిని ముద్దు పెట్టుకున్నానంటూ తన ఫస్ట్‌ కిస్‌ గురించి ఓపెన్‌ అప్‌ అయ్యింది. జీవితంలో తొలి ముద్దు ఎవరికైనా ప్రత్యేకమే. దాన్ని జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. తన లైఫ్‌లోనూ ఆ ఫస్ట్‌ కిస్‌ చాలా స్పెషల్‌ అని తెలిపింది.

అయితే ఇప్పటివరకు తానెప్పుడూ డేట్‌కు వెళ్లలేదని,వాటిపై పెద్ద ఇంట్రెస్ట్‌ కూడా లేదని పేర్కొంది. డేట్‌ అంటే..'ఇంటికి వచ్చేశెయ్‌..కలిసి భోం చేద్దాం, ఫుడ్‌ ఆర్డర్‌ పెట్టుకొని తింటూ చిల్‌ అవుదాం' అని అంటానని పరిణితి తెలిపింది. తన ఫస్ట్‌ క్రష్‌ మాత్రం ఎప్పటికీ హీరో సైఫ్‌ అలీ ఖాన్ అని, ఆయనను అభిమానించడమే కాకుండా అతనిని ప్రేమించే దానిని వెల్లడించారు. కాగాఇంతకుముందు అధిక బరువు కారణంగా చాలా ట్రోలింగ్‌కి గురయ్యానని, అవకాశం వస్తే తన జీవితంలో ఆ అధ్యాయాన్ని చెరిపివేస్తానని పేర్కొంది. అధిక బరువుతో అనారోగ్యం కూడా వస్తుందని, అందుకే ఇప్పుడు ఆరోగ్యం గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నట్లు చెప్పింది.

కొన్ని చేదు అనుభవాలు తన జీవితంలోనూ ఉన్నాయని, వాటిని ఎప్పటికీ మర్చిపోలేనని చెబుతూ పరిణితి ఎమోషనల్‌ అయ్యింది. కాగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా చెల్లెలిగా ఇండస్ర్టీలో అడుగుపెట్టినా..నటనతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న పరిణితి తక్కువ సమయంలోనే స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగింది. ఇటీవలే ఆమె నటించిన ‘ది గాళ్‌ ఆన్‌ ది ట్రైన్‌’ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై పాజిటివ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఆమె నటించిన  సందీప్ ఔర్ పింకీ ఫరార్, సైనా బయోపిక్‌ చిత్రాలు విడుదలకు సిద్ధంగా ఉ‍న్నాయి. 

చదవండి :  (అందుకే సుశాంత్‌తో సినిమా చేయలేదు..)
('అజయ్‌ దేవ్‌గణ్, నీకు సిగ్గనిపించడం లేదా?')

A post shared by Netflix India (@netflix_in)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు