దర్శకులను పెళ్లాడిన హీరోయిన్లు

24 Sep, 2020 15:10 IST|Sakshi

(వెబ్‌ స్పెషల్‌): ఇంటర్వ్యూల్లో చాలా మంది హీరోయిన్లు చెప్పే మాట తాము డైరెక్టర్స్‌ చాయిస్‌ అని. అంటే.. దర్శకులు చెప్పినట్లు తాము చేస్తామని అర్థం. కొన్ని కొన్ని సార్లు ఈ చెప్పే వారి మాటలు అవతలి వారి మనసును తాకుతాయి. దాంతో ఒకరి మీద ఒకరికి ఇష్టం, ప్రేమ కలుగుతాయి. అది కాస్త పెళ్లికి దారి తీస్తుంది. దాంతో కట్‌ చెప్పలేక వారితో జీవితాన్ని ముడి వేసుకున్నారు. హీరోయిన్లు దర్శకులను వివాహం చేసుకోవడం ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో ఉంది. మరి ఇంతకు ఏ హీరోయిన్‌ ఏ దర్శకుడిని పరిణయం ఆడిందో చూడండి..

సుహాసిని-మణిరత్నం
హీరోయిన్‌, దర్శకుల వివాహం టాపిక్‌ వస్తే వెంటనే గుర్తుకు వచ్చేది సుహాసిని-మణిరత్నంల పేర్లే. ఆమె అందం, అభినయాల కలబోత అయితే.. ఆయన భారతీయ ఆత్మను ప్రతిబింబించే చిత్రాల దర్శకుడు. వీరిద్దరి మధ్య ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారి 1988లో వివాహం బంధంతో ఒక్కటయ్యారు. దివంగత దర్శకుడు కె. బాలచందర్‌ ఒత్తిడి మేరకే తాము వివాహం చేసుకున్నామంటారు సుహాసిని. వీరికి ఒక కుమారుడు నందన్‌ ఉన్నాడు. (చదవండి: పెద్దన్నయ్య)

రేవతి - సురేష్ చంద్ర
సురేష్ చంద్ర దర్శత్వంలో రేవతి రెండు చిత్రాల్లో నటించారు. అలా ఏర్పడ్డ పరిచయంతో ఈ జంట ప్రేమలో పడ్డారు. 1986లో వీరిద్దరూ వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. 

కృష్ణవంశీ - రమ్య కృష్ణ 
కృష్ణవంశీ తెరకెక్కించిన చంద్రలేఖ చిత్రంలో రమ్యకృష్ణ నటించారు. అలా ఏర్పడ్డ పరిచయం ప్రేమగా మారింది. ఈ జంట 2003లో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమారుడు రిత్విక్‌ ఉన్నాడు.

రోజా - సెల్వమణి 
రోజాని తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం చేసింది సెల్వమణి. అలా వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. 2002లో రోజా, సెల్వమణిలు వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. బాబు, పాప ఉన్నారు. 

శరణ్య-పొన్నవనన్‌
ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాల్లో క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా చేస్తున్నారు శరణ్య. కానీ 1980-90ల కాలంలో ఈమె చాలా తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. అప్పుడే దర్శకుడు పొన్నవనన్‌తో ప్రేమలో పడ్డారు. వివాహం చేసుకున్నారు.(చదవండి:ఇదే నాకు పెద్ద బర్త్‌డే గిఫ్ట్)

ఖుష్బూ-సుందర్‌
ఇద్దరు కలిసి ఒక్క చిత్రం కూడా చేయలేదు. కన్నడ నిర్మాత అయిన సుందర్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు ఖుష్బూ. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ఇద్దరు కుమార్తెలు కూడా జన్మించారు. వారి పేరు అవంతిక అనందిత. 

సీత- పార్థిపన్ 
సీనియర్ నటి సీత, దర్శకుడు పార్థిపన్‌ని ప్రేమించి వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ 1990లో పెళ్లి చేసుకున్నారు. ఈ జంటకు ఇద్దరు కుమర్తెలు, ఓ దత్తత తీసుకున్న కొడుకు ఉన్నారు. 2001లో ఈ జంట విడాకులతో విడిపోయారు. ఆ తర్వాత సీత మరో వ్యక్తిని వివాహం చేసుకున్నారు. (చదవండి: జీవితం ఉన్నది అనుభవించడానికే..)

దేవయాని- రాజ్ కుమారన్ 
దర్శకుడు రాజ్ కుమారన్, దేవయానిల లవ్ ఎఫైర్ అప్పట్లో ఒక సెన్సేషన్. రాజ్ కుమారన్ దర్శత్వంలో దేవయాని నీ వరువై ఏనా అనే చిత్రంలో నటించారు. వీరిద్దరూ 2001లో వివాహం చేసుకున్నారు. 

అమలాపాల్ - విజయ్‌
దర్శకుడు అమలాపాల్, విజయ్ ప్రేమ వ్యవహారం గురించి తెలిసిందే. పెళ్లి చేసుకున్న కొద్దిరోజులకే వీరిద్దరూ విభేదాలతో విడిపోయారు. వీరే కాక దర్శకుడు సెల్వ రాఘన్‌, హరి, ప్రియ దర్శన్‌ వంటి వారు హీరోయిన్లనే వివాహం చేసుకున్నారు.

మరిన్ని వార్తలు