'బిగ్‌బాస్‌'కు ప్రేమ‌లేఖ రాసిన న‌టి

24 Sep, 2020 15:08 IST|Sakshi

సాక్షి, ముంబై :  రియాలిటీ షో బిగ్‌బాస్ క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. తెలుగు, హిందీ, త‌మిళం ఇలా ఏ భాష‌లో అయినా బిగ్‌బాస్ రేటింగ్‌కు తిరుగులేదు. ఇక అందులో పాల్గొనే కంటెస్టెంట్ల‌కు కూడా బోలెడంత పాపులారిటీని తెచ్చిపెడుతుంది. షో మొద‌లు కాకుండానే ప‌లానా వాళ్లు పాల్గొంటున్నారు. మా దగ్గ‌ర ఆ స‌మాచారం ఉందంటూ లీక్‌వీరులు చేసే లీక్స్ అన్నీ ఇన్నీ కావు. అక్టోబ‌రు3 నుంచి ప్ర‌సారం కానున్న హిందీ బిగ్‌బాస్ కోసం జ‌నాలు తెగ ఎదురుచూస్తున్నారు. ఇప్ప‌టికే  ఈ షోలో ఎవ‌రెవ‌రు పాల్గొంటార‌న్న దానిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా ప‌లు వార్త‌లు షికార్లు చేస్తున్నాయి. వీటిలో టెలివిజ‌న్ న‌టి టీనా ద‌త్తా పేరు కూడా  ఉంది. టీనా బిగ్‌బాస్‌లో క‌నిపించ‌బోతున్నారంటూ  గ‌త కొన్ని రోజులుగా పోస్టులు వైర‌ల్ అవుతున్నాయి. దీంతో ఈ రూమ‌ర్ల‌కు చెక్ పెడుతూ ఓ సుధీర్ఘ లేఖ‌ను విడుద‌ల చేసింది. (బిజీ బిజీగా స‌ల్మాన్ ఖాన్‌)

ఇందులో ''ప్రియ‌మైన బిగ్‌బాస్..బ‌య‌ట మిమ్మ‌ల్ని ఎంత‌గా ప్రేమిస్తున్నారో తెలుసా?  నేను చెబుతూ వినండి..మీతో నాకున్న రిలేష‌న్ గురించి పుకార్లు మొద‌లైన‌ప్ప‌టినుంచి నా ఫోన్ నాన్‌స్టాప్‌గా మోగుతూనే ఉంది. మీడియా వాళ్లు, స్పాన్స‌ర్స్‌, మిత్రులు..అబ్బో ఇలా అంద‌రి కాల్స్‌, మెసేజ్‌ల‌తో  నా ఫోన్ మోగిపోతుంది. ఇవ‌న్నీ చూస్తుంటే నాకు ఎంగేజ్‌మెంట్ ఈవెంట్ జ‌రిగిందేమో అనిపిస్తుంది. మ‌న ఇద్ద‌రి గురించి టీవీల్లో, వెబ్‌సైట్‌లో వార్త‌లు చూసి తెగ ఎంజాయ్ చేస్తున్నాను.. మన బంధం స్వ‌ర్గంలోనో, భూమి మీద‌నో, టెలివిజ‌న్ తెర‌పైనో డిసైడ్ చేసింది కాదు. అస‌లు ఈ వార్త బ‌య‌ట‌కు ఎలా పొక్కొందో అర్థం కావ‌ట్లేదు. ఏదైతేనేం మీ మీద నా ప్రేమ అలాగే ఉంటుంది.   నేను మిమ్మ‌ల్ని ప్రేమిస్తున్నాను కానీ కంటెస్టెంట్‌లా కాదు..ప్రేక్ష‌కురాలిగానే'' అంటూ బిగ్‌బాస్‌కు ప్రేమ లేఖ రాస్తూనే స్టీట్‌గా త‌న‌పై వ‌స్తోన్న రూమ‌ర్ల‌కు ఫుల్‌స్టాప్ పెట్టేసింది.

 ఓ  అడ్వ‌టైజ్‌మెంట్‌తో గుర్తింపు పొందిన టీనా త‌ర్వాత టెలివిజ‌న్ న‌టిగా ఎదిగింది. అక్టోబ‌ర్ 3(శ‌నివారం)న‌ ప్రారంభం కానున్న ఈ షో సోమ‌వారం నుంచి శుక్ర‌వారం వ‌ర‌కు రాత్రి 10.30 గంట‌ల‌కు, శ‌ని, ఆదివారాల్లో రాత్రి 9 గంట‌ల‌కు ప్ర‌సారం కానుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్లు వీరే అంటూ బుల్లితెర నుంచి వెండితెర వ‌ర‌కు ఎంద‌రో సెల‌బ్రిటీల‌ పేర్లు వినిపిస్తున్నాయి. వీరిలో నియా శ‌ర్మ‌, ఆకాంక్ష పూరి, నైనా సింగ్‌, నిశాంత్ మ‌ల్క‌నీ స‌హా ప‌లువురి పేర్లు చ‌క్క‌ర్లు కొడుతున్నాయి. (బిగ్‌బాస్ సీజ‌న్ 14.. అక్టోబ‌ర్ 3నుంచి ప్రారంభం)

My Love Letter To My Favourite Bigg Boss! Ssssh....Romance Kharab Mat Karna ♥️

A post shared by ✨Tinzi In TinzelTown✨🧚‍♀️ (@dattaatinaa) on

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా