'BookMyShow'లో సినిమా టికెట్‌ను రద్దు చేసి.. డబ్బు రిటర్న్‌ ఎలా పొందాలి?

10 Sep, 2023 13:32 IST|Sakshi

ఒకప్పుడు సినిమా చూసేందుకు టికెట్ల కోసం థియేటర్ల ముందు క్యూలు కట్టేవారు. అయితే, కాలం మారింది. టికెట్ కొనుగోలులో అనేక మార్పులు వచ్చాయి. థియేటర్‌కి వెళ్లకుండా ఫోన్‌లో టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. కావాల్సిన సీటును ఎంచుకుని టికోట్టు కొనుక్కుంటే పని తేలిక. షో ప్రారంభానికి 5 నిమిషాల ముందు థియేటర్‌లోకి ప్రవేశిస్తే హాయిగా కూర్చుని నచ్చిన సినిమా చూసుకోవచ్చు.

కానీ కొన్నిసార్లు పలు కారణాల వల్ల మనం బుక్ చేసుకున్న టికెట్‌ను రద్దు చేయాల్సి వస్తుంది. అప్పుడు టికెట్‌ కోసం ఖర్చు చేసిన డబ్బు గురించి ఆలోచిస్తాం. ఈ విషయంలో చాలామంది టెన్షన్ పడతారు. అంత డబ్బు చెల్లించి టికెట్ బుక్ చేసుకున్నామంటే వృధా అని అనుకుంటున్నారు. కానీ చింతించకండి. ఎందుకంటే, మీరు సులభంగా టికెట్‌ను రద్దు చేసుకోవచ్చు అంతే కాకుండా ఆ డబ్బును కూడా తిరిగి పొందవచ్చు.

BookMyShowలో టికెట్‌ను రద్దు చేయడానికి:

►  మీ మొబైల్‌లో 'BookMyShow' యాప్‌ని ఓపెన్ చేయండి.. 
► మీరు లాగ్ అవుట్ అయితే లాగిన్ అయి యాప్‌ని ఓపెన్ చేయండి..
► ప్రొఫైల్ ఐకాన్‌పై క్లిక్ చేయండి.. 
► Your Orders అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. 
► మీరు బుక్ చేసుకున్న టికెట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.. లిస్ట్ వస్తుంది. 
► సినిమాని చూడటానికి మీరు బుక్ చేసిన టిక్కెట్‌ను ఎంచుకోండి. 
► ఆపై బుకింగ్ ఎంపికను రద్దు చేయి అని వస్తుంది అక్కడ క్లిక్ చేయండి.
► స్క్రీన్‌పై క్రిందికి స్క్రోల్ చేయండి
► రీఫండ్ చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. 
► వాపసు పొందండి అని వస్తుంది. అక్కడ క్లిక్ చేయండి.

'బుక్‌మైషో' అధికారిక వెబ్‌సైట్‌లో టికెట్‌ను ఎలా రద్దు చేయాలి?
బుక్‌మైషో ద్వారా టికెట్లను కొందరు మొబైల్ యాప్‌ను ఉపయోగించి చేస్తే..  మరికొందరు మాత్రం  సినిమా టికెట్లను బుక్ చేసుకోవడానికి బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్‌ను ఉపయోగిస్తారు. వారు కూడా అధికారిక వెబ్‌సైట్ నుంచి సినిమా టికెట్‌ను బుక్ చేసినట్లయితే, దానిని రద్దు చేయవచ్చు. 

► బుక్ మై షో అధికారిక వెబ్‌సైట్‌ను తెరవండి. 
► మీ ఖాతాకు లాగిన్ చేయండి.
► కుడి వైపున మీ ప్రొఫైల్‌ని తెరవండి. 
► కొనుగోలు చరిత్రను ఎంచుకోండి. టిక్కెట్‌పై క్లిక్ చేయండి.
► స్క్రీన్‌పైకి స్క్రోల్ చేయండి, రద్దు చేయి నొక్కండి. 
► వాపసు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. 
► ధృవీకరించుపై క్లిక్ చేయండి. 
► గమనిక : కొన్నిసార్లు ఈ వెబ్‌సైట్ పనిచేయకపోవచ్చు


మీరు సూపర్ స్టార్ కస్టమర్ అయితే టికెట్‌ను ఎలా రద్దు చేయాలి?
Bookmyshow యాప్ తన సూపర్ స్టార్ కస్టమర్‌లకు అదనపు ప్రయోజనాలను అందిస్తుంది. ఒక వ్యక్తి సూపర్ స్టార్ కస్టమర్ అయితే, టికెట్ కోసం చెల్లించిన పూర్తి మొత్తాన్ని వారు పొందుతారు. ఎవరైనా కస్టమర్ బుక్ మై షో నుంచి 1 సంవత్సరం లోపు 10 కంటే ఎక్కువ టిక్కెట్లు బుక్ చేసినట్లయితే, అతన్ని 'సూపర్ స్టార్ కస్టమర్' అంటారు. అయితే ఈ సూపర్ స్టార్ కస్టమర్ తన టికెట్‌ను ఎలా రద్దు చేయగలడు? పూర్తి వాపసు ఎలా పొందాలో తెలుసుకోండి.

► BookMyShow యాప్‌ను తెరవండి. 
► మీ ప్రొఫైల్‌కి వెళ్లండి ఆపై మీ టికెట్‌ ఆర్డర్‌ల ఎంపికపై క్లిక్ చేయండి.
► టిక్కెట్‌ను ఎంచుకోండి. 
► సూపర్‌స్టార్ రద్దుపై క్లిక్ చేయండి. 
► అసలు చెల్లింపు పద్ధతిని ఎంచుకోండి. 
► వాపసు పొందండిపై క్లిక్ చేయండి. 
► మీ టికెట్ రద్దును నిర్ధారించండి. అంతటితో మీ డబ్బు బ్యాంకు ఖాతాలోకి జమ అవుతుంది.

BookMyShow టికెట్ రద్దు నియమాలు
BookMyShow టికెట్‌ను రద్దు చేయడానికి కొన్ని నియమాలు ఉన్నాయి. మనం వాటికి లోబడి క్యాన్సల్‌ చేయగలుగుతాం. మీరు వారు ఇచ్చిన నియమాలను పాటించి.. టికెట్లను సులభంగా రద్దు చేసి డబ్బును తిరిగి పొందవచ్చు.బుక్ మై షోలో టికెట్ క్యాన్సిల్ చేసుకోవాలంటే సినిమా స్టార్ట్ అయ్యే 4 గంటల ముందు చేయాలి.. తర్వాత టికెట్ క్యాన్సిల్ చేయలేరు. మీరు సరైన సమయంలో టిక్కెట్‌ను రద్దు చేయకుంటే  డబ్బులో 30% తీసివేయబడుతుంది. మిగిలిన మొత్తం మీకు లభిస్తుంది.

మీరు రీఫండ్ చెల్లింపు కోసం క్రెడిట్/డెబిట్ కార్డ్ లేదా నెట్-బ్యాకింగ్ పద్ధతిని ఎంచుకున్నట్లయితే, దానికి 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. చెల్లింపు మీ ఖాతాలో జమ చేయబడుతుంది. అదే బుక్‌మై షో వాలెట్‌కు కావాలని రిక్వెస్ట్‌ పెడితే  కొన్ని గంటల్లోనే వాలెట్‌లోకి డబ్బు జమ అవుతుంది.
 

మరిన్ని వార్తలు