Sitara Ghattamaneni: నా ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌ అదే: సితార

14 Nov, 2021 11:02 IST|Sakshi

సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు కూతురనే కాదు.. ఆరేళ్ల వయసులోనే సోషల్‌ మీడియాలోకి అడుగుపెట్టి, తన యూనిక్‌ స్టైల్‌తో, పాపులర్‌ అవుతోన్న ‘ఫన్‌టాస్టిక్‌ తార’.. సితార. ఈ చక్కని చుక్కని మరింత చక్కగా చూపించిన ఫ్యాషన్‌బ్రాండ్సే ఇవి.

డ్రెస్‌ డిజైన్‌..
ఇంద్రధనస్సును ఇష్టపడని పిల్లలు ఉండరు. రెయిన్‌బోను పోలిఉండేలా పైభాగాన్ని తెలుపు-నలుపు డాట్‌లతో కాస్త డల్‌గా ఉంచి, కింది భాగాన్ని పసుపు, పర్పుల్‌ రంగులతో హైలెట్‌ చేశారు. వన్‌స్లీవ్‌, బ్లాక్‌ బ్యాండ్‌, డ్రెస్‌కు డిఫరెంట్‌ లుక్‌ను తెచ్చింది. ఇక లైట్‌ మేకప్‌, నో యాక్సనరీస్‌తో సితార ఆ డ్రెస్‌ డిజైన్‌ను మరింత హైలెట్‌ చేసిందనే చెప్పొచ్చు.

జన్యాస్‌ క్లోసెట్‌
ఫ్యాషన్‌ను ఇష్టపడే పిల్లల కోసం స్థాపించిన సంస్తే జన్యాస్‌ క్లోసెట్‌.  2014లో ప్రారంభమైన ఈ బ్రాండ్‌.. అందమైన డిజైన్స్‌తో కొద్ది రోజుల్లోనే లగ్జూరియస్‌ కిడ్స్‌ ప్యాషన్‌ హౌస్‌గా ప్రసిద్దిపొందింది. అప్పుడే పుట్టిన బిడ్డ నుంచి పదహారేల్ల వయసు వారి వరకూ రెడీమేడ్‌ దుస్తులు ఇక్కడ లభిస్తాయి. అయితే, కేవలం బాలికల దుస్తులను మాత్రమే డిజైన్‌ చేస్తారు. పలువురు సెలబ్రిటీల పిల్లలకు జన్యాస్‌ డిజైన్స్‌ అందించింది. వీరి కలెక్షన్స్‌తో ఫోటోషూట్‌లు చేస్తూ సితార కొంతకాలం ఈ బ్రాండ్‌ మోడలింగ్‌ కూడా చేసింది. స్టార్స్‌ కిడ్స్‌ బ్రాండ్స్‌ అంటే ధర కూడా అదే రేంజ్‌లో ఉంటుంది. ప్రత్యేకంగా డిజైన్‌ చేయించుకోవాలంటే లక్షలు ఖర్చు చేయాల్సిందే. ప్రస్తుతం భారత్‌లోని పలు నగరాలతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ డిజైన్స్‌ను కొనుగోలు చేయొచ్చు.

డ్రెస్‌ బ్రాండ్‌: జన్యాస్‌ క్లోసెట్‌
ధర: రూ.11,900

నా మేకప్‌ నేనే వేసుకుంటా.. కొన్ని సార్లు అన్నయ్యను కూడా రెడీ చేస్తుంటా. అన్నయ్యను ఇరిటేట్‌ చేయడం, ఆ ఆల్‌టైమ్‌ ఫేవరెట్‌
- ఘట్టమనేని సితార

మరిన్ని వార్తలు