ఎన్టీఆర్ సినిమాతో జాన్వీ ఎంట్రీ? 

16 Feb, 2023 02:36 IST|Sakshi

దివంగత ప్రముఖ నటి శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆ వార్త నిజం అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ‘జనతా గ్యారేజ్‌’ తర్వాత హీరో ఎన్టీఆర్ , దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రం ద్వారా జాన్వీ తెలుగు ప్రేక్షకులకు హాయ్‌ చెప్పనున్నారని సమాచారం.  గత వారం జాన్వీ హైదరాబాద్‌ వచ్చారని తెలిసింది.

ఎన్టీఆర్ సినిమాకి సంబంధించిన ఫోటోషూట్‌లో పాల్గొనడానికే భాగ్యనగరంలోకి ఈ బ్యూటీ అడుగుపెట్టారట. ఇక ఎన్టీఆర్‌ సినిమాలో హీరోయిన్‌గా నటించడం కోసం ఓ బాలీవుడ్‌  మూవీని కూడా జాన్వీ వదులుకున్నారని టాక్‌. సో... జాన్వీ కపూర్‌ టాలీవుడ్‌ ఎంట్రీ దాదాపు ఖరారైనట్లే అని ఊహించవచ్చు. ఈ నెల 24న ఎన్టీఆర్‌ సినిమా ప్రారంభం కానుందట. మరి ఆ రోజు హీరోయిన్‌ని ప్రకటిస్తారేమో చూడాలి.

మరిన్ని వార్తలు