పెట్టుబడి అవకాశాలు గురించి తెలుసుకోవడానికి చక్కని అవకాశం

20 Nov, 2023 18:55 IST|Sakshi

అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్), ఒమన్‌లోని సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ ప్రతినిధి బృందంతో వ్యాపార కార్యక్రమంలో భాగంగా ఇంటరాక్టివ్ సెషన్, B2B సమావేశాలను ప్రకటించింది. ఈ కార్యక్రమం 2023 నవంబర్ 23, 24 తేదీల్లో హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్‌లో జరగనుంది.

ప్రపంచ మార్కెట్లో తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడంలో భాగంగా సంస్థ 23 తేదీ సాయంత్రం ఇంటరాక్టివ్ సెషన్‌తో కార్యక్రమం ప్రారంభిస్తుంది. ఆ తర్వాత B2B సమావేశాలు జరుగుతాయి. ఒమన్ అండ్ మిడిల్ ఈస్ట్‌లోని అనేక వ్యాపారాలు, పెట్టుబడి అవకాశాలను గురించి నగరంలోని వ్యాపార వేత్తలకు అవగాహన కల్పించడం ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశ్యం.

ఈ సమావేశాలకు హాజరయ్యేవారు సోహార్ పోర్ట్ అండ్ ఫ్రీజోన్ అందించే ప్రయోజనాలు, వాటి ప్రోత్సాహకాల గురించి తెలుసుకుంటారు. ఇందులో పాల్గొనాలంటే తప్పకుండా ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ కోసం డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. 

అసోచామ్ ఆంధ్రప్రదేశ్ & తెలంగాణా డెవలప్‌మెంట్ కౌన్సిల్ చైర్మన్, యాక్సిస్ ఎనర్జీ గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్ 'రవి కుమార్ రెడ్డి కటారు' మాట్లాడుతూ.. దక్షిణ భారతదేశంలో హైదరాబాద్ కీలకమైన ఆర్థిక, పారిశ్రామిక రంగాలకు మూలస్తంభంగా నిలుస్తుందని, ముఖ్యంగా ఔషధ పరిశ్రమకు బలమైన కేంద్రమవుతుందని వ్యాఖ్యానించారు.

గత కొన్ని సంవత్సరాలుగా నగరం నుంచి ఎగుమతులు పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో వీటిని మరింత పెంచడంలో ద్రుష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని వెల్లడించారు. 

యూరోప్, ఆఫ్రికాలలో మాత్రమే కాకుండా మధ్యప్రాచ్య ప్రాంతంలోని వ్యాపారాల కోసం ఒమన్ దక్షిణ భారతదేశాన్ని ఇష్టపడుతోంది. ఇప్పటికే ఈ సంస్థలకు అమెరికా, సింగపూర్ దేశాల్లో కూడా వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయి. అయితే త్వరలో జరిగే ఈ కార్యక్రమం ఒమన్‌లోకి ప్రవేశించడం వల్ల కలిగే అనేక ప్రయోజనాల గురించి భారతీయ వ్యాపారులకు అవగాహన కల్పించడానికి సహాయపడుతుంది. అసోచామ్ ఈ కార్యక్రమానికి పరిశ్రమల ప్రతినిధులను ఆహ్వానిస్తోంది.

మరిన్ని వార్తలు