Jr NTR: బైక్‌ సీన్‌ ట్రోల్స్‌పై స్పందించిన జూ. ఎన్టీఆర్‌

31 Dec, 2021 16:55 IST|Sakshi

తెలుగు ప్రేక్షకులతో పాటు.. యావత్‌ దేశం ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తోంది. సినిమా రిలీజ్‌ డేట్‌ దగ్గరపడుతుండడంతో ఆర్‌ఆర్‌ఆర్‌ టీం మూవీ ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తం ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రమోషన్‌ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఏ రాష్ట్రంలో ప్రమోషన్‌కి వెళ్లినా.. అక్కడి భాషలో, తమ యాక్టివ్‌నెస్‌తో అక్కడి సినీ అభిమానుల్ని, మీడియాను ఎట్రాక్ట్‌ చేస్తున్నారు జూ. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు. ఈ నేపథ్యంలో ఇటీవల జరిగిన ప్రమోషన్‌ కార్యక్రమంలో జూ ఎన్టీఆర్‌కు ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది.

చదవండి: జెర్సీ ఓటీటీ రిలీజ్‌పై మేకర్స్‌ క్లారిటీ

కాగా ఈ మూవీ ట్రైలర్‌లోని ఓ సన్నివేశంలో ఎన్టీఆర్‌ బైక్‌ ఎత్తే సన్నివేశం ఎంతగా పాపులర్‌ అయ్యిందే తెలిసిందే. గూస్‌బంప్స్‌ వచ్చేలా ఉన్న ఈ సీన్‌కు చాలా మంది ఫిదా అయ్యారు. కానీ కొందరూ మాత్రం ఈ సన్నివేశంపై విమర్శలు గుప్పిస్తూ రాజమౌళి, ఎన్టీఆర్‌లను ట్రోల్‌ చేయడం ప్రారంభించారు. ఆ బైక్‌ చాలా బరువుగా ఉంటుంది, అలాంటి బైక్‌ను ఎన్టీఆర్‌ అలవోకగా ఎత్తాడు.. అది అసాధ్యం ఇలాంటి మైండ్‌ లెస్‌ సీన్‌ను ఎలా పెట్టారంటూ నెటిజన్లు విమర్శించారు. దీంతో ఈ సీన్‌ సోషల్‌ మీడియాలో చర్చనీయాంశమైంది.

చదవండి: అప్పుడే ఓటీటీకి నాగశౌర్య లక్ష్య మూవీ, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

ఆ సమయంలో వచ్చిన ట్రోల్స్‌పై తాజాగా ఓ రిపోర్ట్‌ మూవీ ఈవెంట్‌లో ఎన్టీఆర్‌ను ప్రశ్నించాడు. దీనిపై తారక్‌ స్పందిస్తూ.. ఆ సన్నివేశం చేసినప్పుడు తనకు కూడా అదే సందేహం వచ్చిందని, దీంతో రాజమౌళిని వెంటనే దీనిపై ప్రశ్నించానని చెప్పాడు. దీనికి జక్కన్న ‘‘తీవ్రమైన ఆవేశం, అత్యాత్సాహంతో ఉన్నప్పుడు మనిషి ఏదైనా చేయగలడు. ఆ సమయంలో ఆసాధ్యం అనేది ఉండదు. ఈ సన్నివేశంలో ఇదే జరుగుతుంది’’ అని సమాధానం ఇచ్చినట్లు ఎన్టీఆర్‌ వివరణ ఇచ్చాడు. ఇందులో ఆ సీన్‌ ఎందుకు వచ్చింది, కోమరం భీం ఆ బైక్‌ ఎత్తడానికి కారణం ఏంటో సినిమా చూస్తేనే తెలుస్తుందని ఎన్టీఆర్‌ పేర్కొన్నాడు. కాగా ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ సంక్రాంతి సందర్భంగా 2022 జనవరి 7న విడుదల కాబోతోన్న సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు