Kajal Aggarwal : హీరోయిన్‌ కాజల్‌ సర్జరీ చేయించుకుందా? అందుకే అలా కనిపిస్తుందా?

27 Oct, 2022 12:23 IST|Sakshi

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్లు తమ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల వర్కౌట్లు చేస్తుంటారు. వీటితో పాటు సర్జరీలు చేయించుకోవడానికి కూడా ఏమాత్రం ఎనక్కి తగ్గరు. ఇప్పటికే చాలామంది హీరోయిన్లు ముక్కు, పెదాలు, చిన్ సర్జరీ చేయించుకొని ముఖంలో కొత్త మెరుపులు కొనితెచ్చుకున్నారు. ఇక మొన్నటికి మొన్న సమంత కూడా ముఖానికి సర్జరీ చేయించుకుందని వార్తలు వచ్చాయి.

రీసెంట్‌గా విడుదలైన యాడ్‌షూట్‌లో సామ్‌ లుక్‌ కాస్త డిఫరెంట్‌గా కనిపించింది. దీంతో అమెరికాకు వెళ్లి సర్జరీ చేయించుకుందంటూ టాక్‌ వినిపిస్తుంది. తాజాగా ఈ జాబితాలో మరో స్టార్‌ హీరోయిన్‌ కూడా చేరింది. చందమామ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన కాజల్‌ అగర్వాల్‌ రీసెంట్‌గా కాస్మొటిక్‌ సర్జరీ చేయించుకుందని తెలుస్తుంది.

ప్రస్తుతం మాతృత్వపు మాధుర్యాన్ని అనుభవిస్తున్న కాజల్‌ ముఖంలో ఆ తేడా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతకుముందు కంటే ముఖం కాస్త బొద్దుగా మారడంతో పాటు లిప్స్‌ కూడా లావుగా కనిపిస్తున్నాయని, సర్జరీ వల్లే ఇలా అయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఇందులో ఎంతవరకు నిజం ఉందన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని వార్తలు