నటి విచిత్రను ఇబ్బంది పెట్టిన తెలుగు హీరో ఎవరు.. కమల్‌ ఈ సాహసం చేయగలరా?

23 Nov, 2023 11:00 IST|Sakshi

కోలీవుడ్‌లో బిగ్ బాస్ ఏడో సీజన్ జరుగుతోంది. ఇప్పటివరకు బావ చెల్లదురై, ప్రదీప్ ఆంటోని, అనన్య, విజయ్ వర్మ, వినూష, యుకేంద్రన్, అన్నభారతి, ఐషు, కనబాలా తదితరులు షో నుంచి ఎలిమినేట్‌ అయ్యారు. అక్కడి బిగ్‌ బాస్‌ ఓటింగ్‌లో నటి అర్చన టాప్‌లో ఉండగా మరో సీనియర్‌ నటి విచిత్ర కూడా రెండో స్థానంలో కొనసాగుతుంది. అలా టైటిల్‌ రేసులో 'విచిత్ర' కూడా దూసుకొచ్చింది. బిగ్‌ బాస్‌లో నటి విచిత్రకు మంచి మార్కులే పడుతున్నాయి. ఆమె ఆట తీరుతో పాటు చక్కటి మైండ్‌ గేమ్‌ స్ట్రాటజీతో ముందుకు వెళ్తుంది. అందుకే ఆమెకు తమిళనాట భారీగా ఫ్యాన్స్‌ పెరిగారు.  

కమల్‌ ముందు ఉన్న ప్రశ్నలు..
బిగ్‌ బాస్‌ టాస్క్‌లో భాగంగా విచిత్ర చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. టాలీవుడ్‌ ఒక ఫేమస్‌ హీరో వల్ల తను దారుణమైన కాస్టింగ్‌ కౌచ్‌కు గురికావడం జరిగిందని.. పరోక్షంగా అతని వల్లే సినిమాలకు గుడ్‌బై చెప్పినట్లు ఆమె తెలిపింది. అప్పటికే విచిత్ర సుమారు 90కి పైగా చిత్రాల్లో నటించింది. ఈ నేపథ్యంలో విచిత్ర ఏం మాట్లాడిందో శని, ఆదివారాల ఎపిసోడ్‌లో కమల్ హాసన్ మరోసారి చర్చిస్తారా..? ఇంతకు ఆ తెలుగు హీరో ఎవరు..?  ఆ సమయంలో నడిగర్‌ సంఘంలో ఏం జరిగింది..? వంటి ప్రశ్నలతో పాటు ఆమెకు సాయం చేసేందుకు ఎవరూ ఎందుకు రాలేదు..? వంటి విషయాలు ఆమె చెప్పిస్తారా.. అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

కమల్‌ రివీల్‌ చేస్తారా..?
ఈ అంశంపై కోలీవుడ్‌ ప్రముఖ జర్నలిస్టు బిస్మీ మాట్లాడుతూ.. ‘ సినిమా ఇండస్ట్రీలో లైంగిక వేధింపులు జరుగుతున్నాయనడానికి విచిత్ర ప్రకటనే ఉదాహరణ.. దీనిపై శని, ఆదివారాల్లో బిగ్‌ బాస్‌లో హౌస్ట్‌గా కొనసాగుతున్న కమల్‌ హాసన్‌ ఏం చెప్పబోతున్నారో తెలుస్తుంది. నిజాయితీ గల రాజకీయ నాయకుడు, నిజాయితీ గల వ్యక్తి కమల్‌ అయితే విచిత్ర గురించి మాట్లాడాలి. ఆ వ్యక్తి ఎవరో ఆమెతో చెప్పించాలి..? అలాంటి వారిని సమాజానికి దూరంగా ఉంచాలి.. అప్పట్లో కేసు కూడా పెట్టినట్లు విచిత్ర చెబుతుంది. దానిని మళ్లీ తెరపైకి తీసుకురావాలి.' అని ఆయన అన్నారు.

(ఇదీ చదవండి: తెలుగు హీరోపై కోలీవుడ్‌ నటి 'విచిత్ర' వ్యాఖ్యలు.. తెరపైకి వచ్చిన విజయకాంత్‌ పేరు)

ఈ వివాదంపై కమల్ మాట్లాడక పోవచ్చని ఆయన అన్నారు. ఎందుకంటే విచిత్రపై కాస్టింగ్‌ కౌచ్‌కు పాల్పడిన వ్యక్తి చాలా ఫేమస్‌ అని ఆమే చెప్పింది.. అలాంటప్పుడు అతనికి కూడా  అభిమానులు ఉంటారు. అలాంటప్పుడు అతనికి వ్యతిరేకంగా కమల్ హాసన్ మాట్లడలేరు. ఒకవేళ ఆ  ఫేమస్‌ హీరోకు వ్యతిరేకంగా కమల్ మాట్లాడితే టాలీవుడ్‌లో ఆయన సినిమాలకు ఏమైనా ఇబ్బందులు రావచ్చు. దీంతో కమల్ కూడా ఈ విషయంపై అస్పష్టంగా మాట్లాడే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.' అని ఆయన అన్నారు. ఏదేమైనా ఈ శని, ఆదివారాల్లో ప్రసారం  అయ్యే ఎపిసోడ్‌ కోసం ఆ ఫేమస్‌ హీరో అభిమానులతో పాటు కోలీవుడ్‌ బిగ్‌ బాస్‌ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారనడంలో ఎలాంటి సందేహం లేదు.

(ఇదీ చదవండి: తెలుగు హీరోపై కోలీవుడ్‌ నటి విచిత్ర చేసిన పూర్తి వ్యాఖ్యలు ఇవే.. )

మరిన్ని వార్తలు