Dhaakad Collections: బడ్జెటేమో రూ. 90 కోట్లు.. అమ్ముడైన టికెట్లు 20 మాత్రమే..

29 May, 2022 15:35 IST|Sakshi

బాలీవుడ్‌ కాంట్రవర్సీ బ్యూటీ కంగనా రనౌత్ తాజాగా నటించిన చిత్రం ధాకడ్‌.  రజ్‌నీష్‌ ఘాయ్‌ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్‌ మూవీ మే 20న గ్రాండ్‌గా విడుదలైంది. సినిమా టీజర్‌, ట్రైలర్‌ మూవీపై భారీ అంచనాలను నెలకొల్పింది. ధాకడ్‌ మూవీలో యాక్షన్‌ హీరోయిన్‌గా బాలీవుడ్‌లో సత్తా చాటుతుందని అనుకున్నారు. కానీ అందుకు భిన్నంగా అంచనాలన్నీ తారుమారయ్యాయి. రిలీజైన మొదటి రోజు నుంచే ఈ సినిమా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. ఎనిమిదో రోజైన రెండో శుక్రవారం (మే 27) దేశవ్యాప్తంగా కేవలం 20 టికెట్లు మాత్రమే అమ్ముడు పోయాయి. దీంతో రూ. 4,420 మాత్రమే వసూళ్లను రాబట్టగలిగింది. 

ఈ మూవీకి మొత్తం బడ్జెట్‌ రూ. 90 కోట్లు. ఇప్పటివరకు ధాకడ్‌ నమోదు చేసిన షేర్‌ రూ. 5 కోట్లలోపే అని చిత్ర వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ లెక్కన చూసుకుంటే కంగనా మూవీకి వచ్చిన నష్టం రూ. 85 కోట్లకు పైమాటే. దీంతో ఈ సినిమా అత్యంత భారీ నష్టాలు మిగిల్చిన బిగ్గెస్ట్‌ డిజాస్టర్ చిత్రాల జాబితాలో చేరింది. అంతేకాకుండా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చిన ఆ నష్టాన్ని భర్తీ చేలేదని బీటౌన్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమాను తీసుకునేందుకు ఓటీటీలు కూడా ముందుకు రావట్లేదని సమాచారం. కంగనా కాంట్రవర్సీ విషయాలు ఎలా ఉన్నా బాలీవుడ్‌లో ఆమెకు ఫుల్‌ క్రేజ్ ఉంది. స్టార్‌ హీరోయిన్‌ అయిన కంగనా సినిమాకు ఇలాంటి చెత్త కలెక్షన్లు రావడం నిజంగా ఆశ్చర్యమే. 

చదవండి: 👇
బాలీవుడ్‌ స్టార్‌ హీరోల సినిమాలకు నో చెప్పి రిస్క్‌ తీసుకున్నా:కంగనా

ఆరేళ్లప్పుడు లైంగిక వేధింపులు.. కంగనా రనౌత్‌ షాకింగ్ రియాక్షన్‌
 

మరిన్ని వార్తలు