ఉక్కు మహిళగా కంగనా

30 Jan, 2021 01:17 IST|Sakshi

బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ ఈ మధ్య ఎక్కువగా లేడీ ఓరియంటెడ్‌ సినిమాలపైనే దృష్టి పెట్టారు. ఇప్పటికే తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, నటి జయలలిత పాత్రలో ‘తలైవి’ సినిమాను పూర్తి చేసిన కంగన ఇప్పుడు మరో పవర్‌ఫుల్‌ పాత్రలో నటించేందుకు పచ్చజెండా ఊపారు. అది కూడా దేశ తొలి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళగా (ఐరన్‌ లేడీ) పేరున్న ఇందిరా గాంధీ పాత్ర చేయనున్నారు. ‘‘ఈ సినిమా ఇందిరా గాంధీ జీవిత చరిత్ర కాదు... అయితే ఆమె జీవితంలో జరిగిన ప్రధాన ఘట్టం నేపథ్యంలో ఉంటుంది. ఇప్పటికే స్క్రిప్ట్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయి.

భారతదేశంలో నెలకొన్న రాజకీయాలపై ఇప్పటి తరం వారికి మా సినిమా అవగాహన కల్పిస్తుంది. నా స్నేహితుడు సాయి కబీర్‌ (చిత్రదర్శకుడు)తో కలిసి రాజకీయ నేపథ్యం ఉన్న ఈ కథలో నటిస్తున్నందుకు హ్యాపీ. ‘మణికర్ణిక’ చిత్రబృందమే ఈ సినిమాకు కూడా పని చేస్తుంది’’ అని కంగనా రనౌత్‌ పేర్కొన్నారు. కాగా ఇప్పటికే కంగనపై ఫొటోషూట్‌ కూడా చేశారు. ఇందిరాగాంధీ లుక్‌లో కంగన బాగున్నారంటూ కామెంట్లు పెడుతున్నారు అభిమానులు. ఓ పుస్తకం ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని కంగన పేర్కొన్నారు. ఇందులో లాల్‌బహదూర్‌ శాస్త్రి, మొరార్జీ దేశాయ్, సంజయ్‌ గాంధీ, రాజీవ్‌ గాంధీ పాత్రలు కూడా ఉంటాయి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు