Hebbuli Movie: తెలుగులో రిలీజ్‌ కానున్న మరో కన్నడ హిట్‌ మూవీ

8 Feb, 2023 09:41 IST|Sakshi

సుదీప్, అమలాపాల్‌ జంటగా ఎస్‌. కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘హెబ్బులి’. కన్నడలో సూపర్‌ హిట్టయిన ఈ చిత్రం తెలుగులో విడుదల కానుంది. ఎమ్‌. మోహన శివకుమార్‌ సమర్పణలో సి. సుబ్రహ్మణ్యం ఈ నెల 25న ఈ చిత్రాన్ని రిలీజ్‌ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో ట్రైలర్‌ను నిర్మాత సి. కల్యాణ్‌ రిలీజ్‌ చేయగా, మొదటి పాటను నిర్మాత ప్రసన్న కుమార్, రెండవ పాటను ప్రొడ్యూసర్‌ తుమ్మలపల్లి సత్యనారాయణ విడుదల చేశారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ– ‘‘యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ‘హెబ్బులి’. కన్నడలో మంచి వసూళ్లు సాధించిన ఈ చిత్రాన్ని ఫ్యాన్సీ రేటు ఇచ్చి తెలుగులో డబ్‌ చేసి, రిలీజ్‌ చేస్తున్నాను’’ అన్నారు.

చదవండి: రూమర్లు ఎక్కువ, అవకాశాలు తక్కువ.. పాపం నిధి

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు