‘సీత’ మూవీ మేకర్స్‌కు కరీనా షరతులు.. మరీ అంత రెమ్యునరేషనా?!

9 Jun, 2021 10:20 IST|Sakshi

ఇటీవల కాలంలో పౌరాణిక చిత్రాలపై దర్శక-నిర్మాతలు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. అందు తగ్గట్టుగానే భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఇలాంటి సినిమాలు రికార్డుల మోత మోగిస్తున్నాయి. ఇప్పటికే పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆదిపురుష్‌’ తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇదే జానర్‌లో అలౌకిక్‌ దేశాయ్‌ దర్శకుడిగా భారీ ప్రాజెక్ట్‌ ‘సీత’ మూవీ రానుంది. రామాయణంలోని సీత వెర్షన్‌లో రూపొందే ఈ చిత్రంలో సీతగా బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ కరీనా కపూర్‌ నటించనుందని సమాచారం. 

కాగా ఈ మూవీకి ప్రముఖ సినీ రచయిత విజయేంద్ర ప్రసాద్‌ కథ, స్క్రీన్‌ ప్లే అందిస్తున్నారు. అయితే ఈ సినిమాలో నటించడానికి కరీనా రెండు షరతులు పెట్టిందని వినికిడి. అవి.. తాను ముందుగా సంతకం చేసిన ప్రాజెక్ట్స్‌ పూర్తి చేసిన తర్వాత సీతలో నటిస్తానని, మరొకటి తనకు రెమ్యూనరేషన్‌ భారీగా ఇవ్వాలని డిమాండ్‌ చేసినట్లు బీ-టౌన్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే సీత పాత్రను కరీనాతోనే చేయించాలని భావించి ఆమె డిమాండ్‌లకు మేకర్స్‌, విజయేంద్ర ప్రసాద్‌ ఒకే చెప్పారట. సాధార‌ణంగా క‌రీనా ఒక్క సినిమాకు 6 నుంచి 8 కోట్ల పారితోషికం తీసుకుంటుంది. అయితే సీత ప్రాజెక్టులో లీడ్ రోల్ కావడంతో ఎక్కవ సమయాన్ని ఈ ప్రాజెక్ట్‌కే కెటాయించాల్సి ఉందనే ఉద్దేశంతో కరీనా భారీ మొత్తంలో పారితోషికం అడిగినట్లు తెలుస్తోంది. కాగా  ఈ మూవీకి కరీనా 12 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్‌ అడిగినట్లు సమాచారం.

చదవండి: 
విద్యాబాలన్‌ వల్ల కరీనా, షాహిద్‌ విడిపోయారా?
Adipurush: మ్యూజిక్‌ డైరెక్టర్లుగా సాచెత్‌-పరంపరాలు సంతకం!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు