సినిమా నుంచి స్వయంగా తప్పుకున్న యంగ్‌ హీరో.. ఎందుకంటే

27 May, 2021 20:07 IST|Sakshi

2 కోట్లు వెనక్కి ఇచ్చేసిన కార్తీక్‌ ఆర్యన్‌ ? 

బాలీవుడ్‌ యంగ్‌ హీరో కార్తీక్‌ ఆర్యన్‌ అభిమానులకు షాకిచ్చాడు. షారుఖ్ ఖాన్ ప్రొడక్షన్ హౌస్ “రెడ్ చిల్లీస్” తెరకెక్కిస్తున్న ఓ మూవీ నుంచి ఆయన సడెన్‌గా తప్పుకున్నారు. అజయ్ బెహల్ దర్శకత్వంలో తెరకెక్కతున్న ఈ సినిమాలో కార్తీక్‌ ఆర్యన్‌ సరసన కత్రినా కైఫ్‌ నటించనుంది. ఈ సినిమా కోసం దాదాపు రెండేళ్ల క్రితమే కార్తీక్‌ సైన్‌ చేశాడు. అయితే ఇటీవలి కాలంలో దర్శకుడు అజయ్‌తో  క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ ప్రాజెక్టుకు గుడ్‌ బై చెప్పేశాడు. దర్శకుడు ఇది వరకు చెప్పిన స్టోరీ లైన్‌కు, ఇప్పటి  స్క్రిప్ట్ కు సంబంధం లేకపోవడంతో కార్తీక్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నాడట. ఇందుకు గాను అడ్వాన్స్‌గా ఇచ్చిన 2 కోట్ల రూపాయలను తిరిగి ఇచ్చేసినట్లు టాక్‌ వినిపిస్తోంది. లవ్‌ స్టోరీ ప్రధానంగా తెరెకెక్కనున్న ఈ సినిమా షూటింగ్‌ ఈ ఏడాది చివర్లో ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ఆలోపే కార్తీక్‌ ఆర్యన్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నాడు.

గతంలో కార్తీక్‌ ఆర్యన్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న 'దోస్తానా 2' సినిమా నుంచి అతడిని తప్పిస్తున్నట్లు కరణ్‌ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్‌ పేర్కొన్న  సంగతి తెలిసిందే.  జాన్వీ కపూర్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ సగం పూర్తైంది. అయితే కార్తీక్‌ పద్దతేమీ బాగోలేదని, అతడి ప్రవర్తన అనైతికంగా ఉండటంతో కరణ్‌ జోహార్‌ ఆ హీరోను అర్ధాంతరంగా తొలగించినట్లు బీ టౌన్‌ టాక్‌. రెండు వారాలు షూటింగ్‌ జరుపుకుంటున్నప్పటికీ సడన్‌గా హీరోను సైడ్‌ చేయడం బాలీవుడ్‌లో చర్చకు తెరదీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి తాను చేస్తున్న చిత్రం నుంచి అనూహ్యంగా వైదొలిగాడు. 

చదవండి : సగం షూటింగ్‌ అయ్యాక యంగ్‌ హీరోను సైడ్‌ చేశారు
కొరియోగ్రాఫర్ బర్త్‌డే.. అక్షయ్‌కుమార్‌ ఏం గిఫ్ట్‌ ఇచ్చారో తెలుసా?

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు