షూటింగ్‌లో‌ కుప్పకూలిన బాలీవుడ్‌ నటుడు

21 Dec, 2020 11:29 IST|Sakshi

వివేక్‌ అగ్నిహోత్రి దర్శకత్వంలో బాలీవుడ్‌ విలక్షణ నటుడు మిథున్‌ చక్రవర్తి నటిస్తోన్న చిత్రం ‘ది కశ్మీర్‌ ఫైల్స్’‌. ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ముస్సోరీలో జరుగుతోంది. అయితే తాజాగా షూటింగ్‌లో నటుడు మిథున్‌  చక్రవర్తి అనారోగ్యానికి గురయ్యారు. కడుపు నొప్పి కారణంగా ఆరోగ్యం క్షీణించి షూటింగ్‌లో కుప్పకూలిపోయాడు. దీంతో సడెన్‌గా చిత్రీకరణను నిలిపి వేశారు. ఈ మేరకు డైరెక్టర్‌ వివేక్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ‘మిథున్‌ పాత్రపై పెద్ద యాక్షన్‌ సన్నివేశం కోసం షూట్‌ చేస్తున్నాం. ఈ క్రమంలో మిథున్‌ అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. ఫుడ్‌ పాయిజనింగ్‌ కారణంగా కళ్లు తిరిగి పడిపోయాడు. సాధారణంగా ఏ వ్యక్తి కూడా ఆ  పరిస్థితుల్లో కనీసం నిల్చోలేరు. కానీ మిథున్‌ కొద్దిసేపు తీసుకొని విశ్రాంతి మళ్లీ వచ్చి షూట్‌ చేశారు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా షూట్‌ చేస్తారని నేను అస్సలు ఉహించలేను. కానీ మిధున్‌ చేశాడు. అందుకే అతను సూపర్‌ స్టార్‌ అయ్యాడు. చదవండి: మిథున్‌‌ చక్రవర్తి కొడుకుపై అత్యాచారం కేసు

తన నాలుగు దశబ్దాల కెరీర్‌లో ఎప్పుడూ అనారోగ్యంతో బాధపడలేదని ఇటీవల మిథున్‌ నాకు చెప్పాడు. మీ షూటింగ్‌ నా వల్ల ఆగిపోలేదు కదా అని నన్ను అడిగే వాడు. నాకు నిజంగా ఆశ్యర్యం వేస్తోంది. ఎందుకంటే ఇంతటి అంకితభావంతో పనిచేసేవాళ్లను ఈ తరం నటుల్లో ఎవర్ని చూడలేదు. మిథున్‌చాలా కష్టజీవి. ప్రతిరోజు షూట్‌కు వచ్చినప్పుడు అందరిని ఆప్యాయంగా పలకరిస్తాడు. తన పని తాను వేగంగా చేస్తాడు. మిథున్‌ చక్రవర్తి లాంటి నటుడు ఉండటం ఏ మూవీ యూనిట్‌కైనా ఆస్తి వంటింది.’ అని వివేక్‌ పేర్కొన్నారు. కశ్మీరీ హిందువుల దుస్థితి గురించి ప్రపంచానికి తెలియజేయడానికి ‘కాశ్మీర్ ఫైల్స్’  చిత్రం ఒక చిన్న మెట్టులాగా  ఉపయోగపడుతుందని వివేక్‌ అభిప్రాయపడ్డారు. అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో నటించిన ‘ది కాశ్మీర్ ఫైల్స్’ 2021 లో విడుదల కానుంది.

మరిన్ని వార్తలు