కేజీఎఫ్‌-2; యశ్‌ అభిమానులకు సర్‌ప్రైజ్‌

4 Jan, 2021 14:26 IST|Sakshi

కన్నడ స్టార్‌​ యశ్‌ హీరోగా దర్శకుడు ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్న చిత్రం ‘కేజీఎఫ్‌ చాప్టర్‌-2’. హోంబలే ఫిలింస్‌ పతాకంపై విజయ్‌ కిరగందూర్ ఈ సినిమాని పాన్ ఇండియా చిత్రంగా‌ నిర్మిస్తున్నారు. తాజాగా యశ్‌ అభిమానులకు డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ బిగ్‌ సర్‌ప్రైజ్‌ అందించారు. ప్రస్తుతం షూటింగ్‌ జరుపుకొంటున్న కేజీఎఫ్‌-2 నుంచి స్టన్నింగ్‌ లుక్‌ను సోమవారం విడుదల చేశాడు. ‘సామ్రాజ్యం తలుపు తెరవడానికి కౌంట్‌డౌన్‌ ఇప్పుడు ప్రారంభమవుతుంది’ అని ఒక చేతిలో కర్ర పట్టుకొని హీరో యశ్‌ చీకట్లో దర్జాగా కూర్చున్న ఫోటోను ట్విటర్‌లో  షేర్‌ చేశారు. దీనితోపాటు టీజర్‌ విడుదల తేదిని ప్రకటించారు. జనవరి 8న కేజీఎఫ్‌2 టీజర్‌ను రిలీజ్‌ చేయనున్నట్లు వెల్లడించారు. యశ్‌ ఫోటో నెట్టింటా వైరలవుతోంది. అంతేగాక కేజీఎఫ్‌ చాప్టర్‌2 హ్యష్‌ట్యాగ్‌ ట్విటర్‌లో ట్రెండ్‌ అవుతోంది. చదవండి: కేజీఎఫ్‌2 సర్‌ప్రైజ్‌ : యశ్‌ బర్త్‌డే గిఫ్ట్

కాగా కేజీఎప్ 2 చిత్రాన్ని వారాహి చలన చిత్రం తెలుగులో విడుదల చేస్తోంది. ఈ సినిమా 2018లో వచ్చిన కేజీఎఫ్‌ ఛాప్టర్‌1కు సీక్వెల్‌ అన్న విషయం తెలిసిందే. ఇందులో రాఖీ భాయ్‌గా యశ్‌.. పవర్‌ఫుల్‌ విలన్‌ పాత్రలో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌ దత్‌ నటిస్తున్నారు. శ్రీనిధి శెట్టి, రవీనా టండన్‌, ప్రకాశ్‌ రాజ్‌, రావు రమేష్‌, మాళవిక అవినాష్‌ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. గత రెండేళ్లుగా చిత్రీకరణ జరుపుకొంటున్న కేజీఎఫ్‌-2 ప్రస్తుతం చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే హీరో యశ్‌, సంజయ్‌ దత్‌లపై చిత్రీకరించే భాగం పూర్తి చేసుకోగా ఫైనల్‌ షెడ్యూల్‌ జనవరిలో పూర్తి కానుంది. ఇందుకు రామోజీ ఫిల్మీ సిటీలో భారీ సెట్‌ వేశారు. ఇదిలా ఉండగా ఎలాంటి సంచ‌ల‌నాలు లేకుండా విడుద‌లైన కేజీఎఫ్ చిత్రం రూ. 200 కోట్ల వ‌సూళ్ళు రాబ‌ట్టి చరిత్ర సృష్టించడంతోకేజీఎఫ్ 2 పై కూడా భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా టీజర్‌ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు