మూడు పెళ్లిళ్లు.. అతనే నా సిసలైన భర్త: నటి

19 Jun, 2021 10:40 IST|Sakshi

రియాలిటీ టీవీషోలతో, హాట్‌ మోడలింగ్‌తో గ్లోబల్‌ వైడ్‌గా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ సంపాదించుకుంది కిమ్‌ కర్దాషియన్‌. ఈ అమెరికన్‌ మోడల్‌ వ్యవహరం ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌కు దారి తీసింది. గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్న కిమ్‌.. ముచ్చటగా మూడోసారి భర్త కన్యెయ్‌ వెస్ట్‌ నుంచి విడాకులు కొరుతూ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ‘వెస్ట్‌ మాత్రమే బెస్ట్‌’ అని కామెంట్‌ చేసిన కిమ్‌.. ‘జీవితంలో తాను ఒక్కసారే నిజమైన పెళ్లి చేసుకున్నాన’ని చెప్పడం నవ్వులాటకు దారితీసింది. 

కిమ్‌ తన కర్దాషియన్‌ ఫ్యామిలీ మెంబర్స్‌తో రియాలిటీ షోలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా తాజా ఎపిసోడ్‌లో మాట్లాడుతూ.. ‘‘గతం గురించి నాకు అక్కర్లేదు. కానీ, కన్యెయ్‌తో నా బంధం మాత్రమే బలమైంది. అమేజింగ్‌ వ్యక్తి అతను. దానిని నేను సిసలైన పెళ్లిగా భావిస్తా. నా పిల్లల మీద నాకంటే అతనికే ఎక్కువ ప్రేమ ఉంది. కన్యెయ్‌కు నేను ఎప్పటికీ వీరాభిమానని.అతను నా ఫ్యామిలీనే!. అని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అయితే ఈ స్టేట్‌మెంట్‌పై కన్యెయ్‌ అభిమానులు మండిపడుతున్నారు. అతను సంతోషంగా ఉండడం ఓర్వలేక.. మళ్లీ అతనికి దగ్గరవ్వాలని కిమ్‌ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తున్నారు. గతంలో దామోన్‌ థామస్‌, అమెరికన్‌ బాస్కెట్‌బాల్‌ ప్లేయర్‌(మాజీ) హంపెరిస్‌ను పెళ్లి చేసుకుని ఎక్కువ కాలం రిలేషన్‌ కొనసాగించలేక విడిపోయింది.

      
 
ఇక కిమ్‌ ఇలా విడాకులకు కోర్టుకు వెళ్లిందో లేదో..  అమెరికన్‌ ర్యాపర్‌ కన్యెయ్‌ వెస్ట్‌, రష్యన్‌ మోడల్‌ ఇరినా షాయ్క్‌తో డేటింగ్‌ చేస్తున్నాడు. విడాకులపై ఇప్పటి వరకు పెదవి విప్పని వెస్ట్‌.. ఇరినాతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నాడు. అయితే కిమ్‌ టార్చర్‌తో కన్యెయ్‌ వెస్ట్‌ ఇన్నేళ్లు మానసిక క్షోభను అనుభవించాడని, ప్రస్తుతం ఇరినాతో అతని జీవితం సంతోషంగా ఉందని అతని అభిమానులు సంబురపడుతున్నారు. డబ్బు మోజున్న కిమ్‌, కన్యెయ్‌ను నిర్లక్ష్యం చేసిందనేది వాళ్ల వాదన. అందుకే ఆ జంట విడాకులు తీసుకోబోందని పలు కథనాలు కూడా ప్రచురితం అయ్యాయి. అయితే 40 ఏళ్ల కిమ్‌ మాత్రం ప్రత్యేకించి కారణం ఏదీ లేదని.. అభిప్రాయభేధాల వల్లే విడిపోతున్నామని ప్రకటించడం విశేషం.

చదవండి:  విడాకులు రాకున్న ఫర్వాలేదంటున్న కుబేరులు!

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు