ఆరునెలలుగా మేకోవర్‌..  హీరో రియారాజ్‌ కొత్త సినిమా ప్రారంభం

30 Oct, 2022 08:48 IST|Sakshi

తమిళసినిమా: రియోరాజ్‌ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రం శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. విజన్‌ సినిమా హౌస్‌ పతాకంపై డాక్టర్‌ డి.అరుళానందు నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా హరిహరన్‌ రామ్‌ దర్శకుడుగా పరిచయమవుతున్నారు. ఈయన ఇంతకుముందు మీసైయ మురుక్కు చిత్రానికి అసోసియేట్‌ డైరెక్టర్‌ గానూ, నెంజముండు నేర్మైయుండు చిత్రానికి కో–డైరెక్టర్‌గా పని చేశారు.

కాగా రియోరాజ్‌కు జంటగా నటి మాళవిక మనోజ్, భవ్య త్రిక్కా నటిస్తున్నారు. నటుడు చార్లీ అన్బుదాసన్‌ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్ర ముహూర్తపు సన్నివేశానికి దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌ ఆన్లైన్‌ ద్వారా క్లాప్‌ కొట్టి షూటింగ్‌ ప్రారంభించారు. ఇది ఎమోషన్‌తో కూడిన ఫీల్‌ గుడ్‌ ప్రేమ కథా చిత్రంగా ఉంటుందని దర్శకుడు తెలిపారు.

ప్రేమ, కుటుంబ అనుబంధాలను ఆవిష్కరించే చిత్రం అని చెప్పారు. ఈతరం తల్లిదండ్రులు, పిల్లలకు ట్రైలర్‌ మేడ్‌ కథా చిత్రంగా ఇది ఉంటుందన్నారు. చిత్రం కోసం నటుడు లియో రాజ్‌ పూర్తిగా మేకోవర్‌ అయ్యారు. గడ్డం, మీసాలు పెంచి తన గెటప్‌నే మార్చేశారు. ఈ చిత్రంలోని పాత్ర కోసం ఆయన ఆరు నెలలుగా మేకోవర్‌ అయినట్లు రియోరాజ్‌ తెలిపారు. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి కేజీ.విగ్నేశ్‌ చాయాగ్రహణ, సిద్ధుకుమార్‌ సంగీతాన్ని అందిస్తున్నారు.

మరిన్ని వార్తలు