Meelo Okadu Movie: ఆయన లేకపోతే నేను లేను: హీరో

31 May, 2022 08:23 IST|Sakshi

Kuppili Srinivas Meelo Okadu Teaser Trailer Launch: కుప్పిలి శ్రీనివాస్‌ హీరోగా నటించి, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మీలో ఒకడు’. హ్రితికా సింగ్, సాధనా పవన్‌ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రంలో సుమన్‌ కీలక పాత్రలో నటించారు. చిన్ని కుప్పిలి సమర్పణలో రూపొందింది. సోమవారం శ్రీ సూర్యనారాయణ క్రియేషన్స్‌ బ్యానర్‌ను ఆధ్యాత్మిక గురు, ‘ఏపీ సాధు పరిషత్‌’ అధ్యక్షులు శ్రీ శ్రీనివాసనంద స్వామి లాంచ్‌ చేశారు.

నిర్మాత సాయి వెంకట్, వ్యాపారవేత్త ఎస్వీఆర్‌ నాయుడు ఈ సినిమా టీజర్‌ను, సుమన్, ఆధ్యాత్మిక గురు యద్దనపూడి దైవాదీనం, పిట్ల మనోహర్‌ ట్రైలర్‌ని రిలీజ్‌ చేశారు. కుప్పిలి శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘మా ఊరి సర్పంచ్‌ ఎస్వీఆర్‌ నాయుడుగారు లేకపోతే నేను లేను. మా సినిమాలో చాలా ట్విస్టులుంటాయి’’ అన్నారు. ‘‘44 ఏళ్లుగా సినిమాలు చేస్తున్నాను. ఇన్నేళ్లుగా నాకు సహకరిస్తున్న నా నిర్మాతలకు, దర్శకులకు, సాంకేతిక నిపుణులకు, ఆదరిస్తున్న నా అభిమానులకు పాదాభివందనాలు’’ అని నటుడు సుమన్‌ అన్నారు.  

చదవండి:👇
అలా ప్రచారం చేయడం సరి కాదు: కమెడియన్‌ అలీ
బిగ్‌బాస్‌ ఫేమ్‌ షణ్ముఖ్‌ జశ్వంత్‌ ఇంట్లో తీవ్ర విషాదం..

మరిన్ని వార్తలు