Latha Rajinikanth: రజినీకాంత్‌ భార్యకు ముందస్తు బెయిల్.. అసలేం జరిగిందంటే?

27 Dec, 2023 17:14 IST|Sakshi

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్‌ భార్య లతా రజినీకాంత్‌కు బెయిల్ మంజూరైంది. ఐశ్వర్య రజినీకాంత్ తెరకెక్కించిన కొచ్చాడియాన్ సినిమా ప్రొడక్షన్ టైంలో ఓ యాడ్ ఏజెన్సీ కంపెనీ నుంచి  తీసుకున్న ఋణం తిరిగి ఇవ్వకపోవడంపై లతా రజినీకాంత్పై చీటింగ్ కేసు నమోదైంది. ఈ కేసులో ఆమెకు తాజాగా బెంగళూరు కోర్టు  ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌ మాత్రమే లభించింది. అయితే డిసెంబర్‌ 1, 2023న కోర్టు బెంగళూరు కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. దీంతో ముందస్తుగా బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించారు. 

అసలేం జరిగిందంటే.. 

కొచ్చాడయాన్‌ సినిమాను భారీ ఖర్చుతో పెట్టి తెరకెక్కించారు దర్శక నిర్మాతలు.  ఈ సినిమా నిర్మించిన మీడియా వన్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో పనిచేస్తున్న మురళి అనే వ్యక్తికి.. చెన్నైకి చెందిన యాడ్ బ్యూరో అడ్వర్‌టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ రూ. 6.2 కోట్ల రుణం ఇచ్చింది. మురళికి ఇచ్చిన రుణానికి గ్యారెంటర్‌గా లతా రజనీకాంత్ సంతకం చేశారు. మురళి అప్పు తీర్చకపోవడంతో హామీదారుగా ఉన్న లత ఈ కేసులో చిక్కుకుపోయారు. తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు...  రూ.1 లక్ష వ్యక్తిగత పూచీకత్తు, మరో రూ.25 వేల నగదు కోర్టుకు చెల్లించడంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరైంది.

>
మరిన్ని వార్తలు