Rubina Dilaik: బుల్లితెర జంటకు ట్విన్స్‌.. కాస్తా ఆలస్యమైనా చెప్పేశారు!

27 Dec, 2023 16:44 IST|Sakshi

బుల్లితెర నటి, బిగ్‌బాస్‌ విజేత రుబీనా దిలక్ ఫ్యాన్స్‌కు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. తాను కవల పిల్లలకు జన్మనిచ్చినట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే ఈ విషయాన్ని నెల రోజుల తర్వాత రివీల్ చేసింది. నవంబర్ 27న గురునానక్ జయంతి  సందర్భంగా జన్మించినట్లు ఆమె వెల్లడించింది. కానీ అంతకుముందే రుబీనా-అభినవ్ జంటకు ట్విన్స్ జన్మించినట్లు రుబీనా ఫిట్‌నెస్ ట్రైనర్  పోస్ట్ చేశారు. 

ఈ బుల్లితెర జంట తమ కుమార్తెల పేర్లను కూడా వెల్లడించారు. కవలలకు జీవా, ఈధా అనే పేర్లు పెట్టినట్లు తెలిపారు. పిల్లలు జన్మించి నెల రోజులు పూర్తి కావడంతో ఇంట్లో పూజలు నిర్వహించారు. తమ కూతుళ్లను చేతుల్లో పట్టుకుని కెమెరాల ముందు కనిపించారు. కాగా.. రుబీనా బుల్లితెర నటుడు అభినవ్ శుక్లాను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

తమ ఇన్‌స్టాలో రాస్తూ.. 'మా కుమార్తెలు జీవా, ఎధాలకు నెల రోజులు నిండాయని పంచుకోవడానికి చాలా సంతోషిస్తున్నా. గురుపురాబ్ లాంటి పవిత్రమైన రోజున ఆ దేవుడు ఆశీర్వదించాడు. ఈ సందర్భంగా దేవతలకు మా శుభాకాంక్షలు.' అంటూ పోస్ట్ చేశారు. ఇది చూసిన అభిమానులు బుల్లితెర జంటకు అభినందనలు తెలుపుతున్నారు.  

కాగా.. ఈ జంట 2018లో సిమ్లాలో గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నారు. అయితే వీరిద్దరు సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్- 14 లో పాల్గొన్నారు. ఈ సీజన్ విజేతగా రుబీనా నిలిచింది. అభినవ్ ఇంట్లో పెద్దమనిషిగా ప్రశంసలు అందుకున్నారు. 

A post shared by Rubina Dilaik (@rubinadilaik)

>
మరిన్ని వార్తలు