'విక్రమ్‌' డైరెక్టర్‌ లోకేశ్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో జయంరవి

6 Jan, 2023 10:22 IST|Sakshi

తమిళసినిమా: మానగరం, ఖైదీ, మాస్టర్, విక్రమ్‌ నాలుగే ఛిత్రాలతో స్టార్‌ దర్శకుల పుట్టింట్లో చేరిన యువదర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌. తాజాగా రెండోసారి విజయ్‌ని డైరెక్ట్‌ చేస్తున్నారు. ఈ చిత్రం షూటింగ్‌ ఇటీవలే సైలెంట్‌గా మొదలైంది. ఇందులో నటి త్రిష నాయకిగా నటిస్తున్నట్లు సమాచారం. ఇతర ముఖ్య పాత్రల్లో బాలీవుడ్‌ నటుడు సంజయ్‌దత్, దర్శకుడు గౌతమ్‌మీనన్, అర్జున్, దర్శకుడు మిష్కిన్‌ భారీ తారాగణం నటిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రాన్ని 7స్క్రీన్‌ స్టూడియోస్‌ పతాకంపై లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. అనిరుద్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభం దశలోనే లోకేష్‌ కనకరాజ్‌ తదుపరి చిత్రానికి స్కెచ్‌ వేసినట్లు తాజా సమాచారం. ఈయన తదుపరి హీరో జయంరవి అనే విషయం వెలుగులోకి వచ్చింది. వీరిద్దరు కలిసిన ఫొటో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతోంది.

ఈ విషయమై జయంరవి ఒక భేటీలో పేర్కొంటూ లోకేష్‌ కనకరాజ్‌ తనకు ఇటీవల ఒక కథ చెప్పారని, అది తనను విస్మయపరిందన్నారు. దీంతో వీరి కాంబినేషన్లో చిత్రం తెరకెక్కనుంది అనే ప్రచారం జోరందుకుంది. ప్రస్తుతం ఈయన సైరన్, ఇరైవన్, ఎం.రాజేష్‌ దర్శకత్వంలో ఒక చిత్రం చేస్తూ బిజీగా ఉన్నారు. వీటిని పూర్తి చేసిన తరువాత లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో నటించే అవకాశం ఉంది. ఇకపోతే ఈయన నటింన అఖిలన్‌ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది.

మరిన్ని వార్తలు